USA: అమెరికాలో భారత సంతతి సంపన్న కుటుంబం మృతి కేసులో సంచలన నిజాలు!
అమెరికాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. నివేదిక ప్రకారం.. భార్య, కుమార్తెలను భర్త తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. ఈ మేరకు నార్ఫోక్ డిస్ర్టిక్ అటార్నీ మైఖేల్ మోరిస్సే కార్యాలయం తెలిపింది. ఈ కేసులో పూర్తిస్థాయి నివేదిక త్వరలో వస్తుందని పోలీసులు తెలిపారు.

తాజాగా మసాచుసెట్స్ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన సంపన్న కుటుంబం వారి నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. రాకేశ్ కమల్, ఆయన భార్య టీనా, కుమార్తె అరియానా నుంచి రెండు రోజులుగా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. వారి బంధువు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. వీరి మృతిపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేశారు. రాకేశ్ కమల్ దంపతులు 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. అయితే 2021లో దాని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎడ్యునోవా వెబ్‌సైట్ ప్రకారం రాకేశ్.. బోస్టన్ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందారు. ఆయనకు విద్యారంగంలో విశేష అనుభవం ఉంది. టీనా, హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఆమెకు రెడ్‌క్రాస్ ఛారిటీ బోర్డులో పనిచేసిన అనుభవం ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.