Flexi War in AP: ఏపీలో వైసీపీ, జనసేన మధ్య జోరుగా ఫ్లెక్సీ వార్‌.. బాహాబాహీకి దిగుతున్న ఇరు పార్టీల నేతలు

ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్‌ కొనసాగుతోంది. అధికార పార్టీ వైసీపీ వర్సెస్‌ ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతుంది. వైసీపీ వర్సెస్ జనసేనగా నడుస్తోంది  ఫ్లెక్సీవార్‌

Flexi War in AP: ఏపీలో వైసీపీ, జనసేన మధ్య జోరుగా ఫ్లెక్సీ వార్‌.. బాహాబాహీకి దిగుతున్న ఇరు పార్టీల నేతలు
Flexi War In Ap
Follow us

|

Updated on: Jun 02, 2023 | 10:52 AM

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే పార్టీల మధ్య యుద్దం మొదలైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీవార్‌ నడుస్తోంది. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్‌ కొనసాగుతోంది. అధికార పార్టీ వైసీపీ వర్సెస్‌ ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతుంది. వైసీపీ వర్సెస్ జనసేనగా నడుస్తోంది  ఫ్లెక్సీవార్‌. జనసేన వర్సస్ అధికార వైఎస్సార్సీపీ మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నేతను పవన్ కళ్యాణ్ మోస్తున్నట్లు వైసీపీ ఏర్పాటు చేసిన ప్లెక్సీ మరింత అగ్గిని రాజేసింది. ఇందుకు ప్రతిగా జనసేన నేతలు వైసిపీ నేతల తీరుపై ప్లెక్సీ ఏర్పాటు చేస్తూ.. మరింత అగ్గి రాజేశారు.

తాజాగా కైకలూరులో వైసీపీ ఫ్లెక్సీల పక్కనే జనసేన ఫ్లెక్సీలు పెట్టడంతో గొడవ మొదలైంది. అధికార పార్టీ కార్యకర్తుల జనసేన ఫ్లెక్సీలు తొలగించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అడ్డుకున్న పోలీసుతో జనసేన కార్యకర్తలు గొడవకు దిగడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు,

మూడు పార్టీల శ్రేణులు ఫ్లెక్సీల ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఒక పార్టీ పై మరో పార్టీ నినాదాలు.. వ్యంగాస్త్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం వివాదానికి కారణం అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..