Vivekananda Case: నేడు నాంపల్లి కోర్టు లో వివేక హత్య కేసు విచారణ.. నిందితులను హాజరు పరచనున్న పోలీసులు

చంచల్ గూడ జైలు నుంచి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులైన గంగి రెడ్డి,సునీల్ యాదవ్,ఉమా శంకర్ రెడ్డి,దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి,ఉదయ్ కుమార్ రెడ్డి,భాస్కర్ రెడ్డిలను జైలు నుంచి సీబీఐ కోర్టు కు తరలించనున్నారు.

Vivekananda Case: నేడు నాంపల్లి కోర్టు లో వివేక హత్య కేసు విచారణ.. నిందితులను హాజరు పరచనున్న పోలీసులు
Viveka Murder Case
Follow us

|

Updated on: Jun 02, 2023 | 10:32 AM

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నేడు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. పోలీసులు హత్యకేసులోని నిందితులను పోలీసులు కోర్ట్ లో హాజరు పరచనున్నారు. ఈరోజు వివేకానంద రెడ్డి హత్యతో సంబంధమున్న నిందితులను సీబీఐ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.

చంచల్ గూడ జైలు నుంచి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులైన గంగి రెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను జైలు నుంచి సీబీఐ కోర్టు కు తరలించనున్నారు. ఉదయం 10 గంటలకు చంచల్ గూడ జైల్ నుండి సీబీఐ కోర్ట్ కు పోలీసులు తరలించనున్నారు. 10:30 కు సిబిఐ కోర్ట్ లో నిందితులను విచారణ జరపనున్నారు. మరో వైపు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైనా విచారించనుంది. అయితే మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి గత రెండు  వాయిదాల కు డుమ్మా కొట్టారు. అంతేకాదు వైఎస్ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని అప్రూవర్ దస్తగిరి చెప్పిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..