Governor Tamilisai: దేవుడు నన్ను తెలంగాణకు పంపడం నా అదృష్టం.. రా ష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్‌ తమిళి సై

రాజ్‌ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ పుట్టినరోజు కూడా ఈరోజే కావడంతో తమిళి సై సౌందరరాజన్‌ కేక్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 1969 ఉద్యమ నాయకులను గవర్నర్ సత్కరించారు.

Governor Tamilisai: దేవుడు నన్ను తెలంగాణకు పంపడం నా అదృష్టం.. రా ష్ట్ర అవతరణ వేడుకల్లో గవర్నర్‌ తమిళి సై
Governor Tamilisai Soundararajan
Follow us

|

Updated on: Jun 02, 2023 | 10:52 AM

రాజ్‌ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ పుట్టినరోజు కూడా ఈరోజే కావడంతో తమిళి సై సౌందరరాజన్‌ కేక్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 1969 ఉద్యమ నాయకులను గవర్నర్ సత్కరించారు. అనంతరం మాట్లాడిన గవర్నర్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భవ దినోత్సవం శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమం పూర్తి అహింస ఉద్యమం. తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా జోహార్లు. 1969 ఉద్యమంలో పాల్గొన్న కొంతమందిని సత్కరించడం నా అదృష్టం. రాష్ట్ర ఉద్యమంలో మమేకమైన ప్రతిఒక్కరికీ వందనాలు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. జాతీయ నగరంగా హైదరాబాద్ పేరు సంపాదించింది. తెలంగాణ అంటే కేవలం హైదరాబాద్ అభివృధి కాదు, మారుమూలలు అభివృధి చెందడమే అసలైన అభివృద్ధి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనమందరం తెలంగాణ అభివృద్ధికి అడుగులు వేద్దాం. జై తెలంగాణ అంటే స్లోగన్ మాత్రమే కాదు ఆత్మగౌరవ నినాదం. నా జీవితంలో ప్రతినిమిషం ప్రజలకోసమే. దేవుడు నన్ను తెలంగాణలకు పంపడం నా అదృష్టం. కొంత మంది అభివృద్ధి కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అయితేనే సంపూర్ణ అభివృద్ధి అనిపించుకుంటుంది. వచ్చే సంవత్సరం నాటికి దేశంలో తెలంగాణ నంబర్ వన్‌ కావాలి’ అని ఆకాంక్షించారు తమిళి సై.

కాగా ఉదయం 10 నుంచి 11 గంటల వరకు రాజ్‌భవన్‌లోని దర్బారు హాల్‌లో గవర్నర్‌ తమిళిసై సామాన్య ప్రజలు, ప్రముఖులతో కలిసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో జరిగే వేడుకలకు సామాన్య ప్రజలకు ఆహ్వానం ఉందని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రగతి భవన్‌లో జెండా ఎగురవేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం, గన్ పార్క్ కు చేరుకుని నివాళులు అర్పించారు. ఆ తర్వాత తెలంగాణ సచివాలయానికి చేరుకుని, దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..