Janasena: జనసేన రెండో జాబితాపై పవన్ కసరత్తు.. మరో 10 పేర్లను ప్రకటించే ఛాన్స్‌!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దూకుడు పెంచారు. జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత పవన్‌ రెండో లిస్టును ప్రకటించే అవకాశం ఉంది.

Janasena: జనసేన రెండో జాబితాపై పవన్ కసరత్తు.. మరో 10 పేర్లను ప్రకటించే ఛాన్స్‌!
Pawan Kalyan
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 04, 2024 | 11:49 AM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దూకుడు పెంచారు. జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత పవన్‌ రెండో లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తులో భాగంగా 24 సీట్లలో పోటీచేస్తున్న జనసేన.. తొలి జాబితాలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్‌, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ , కాకినాడ రూరల్‌ నుంచి పంతం నానాజీ పేర్లను ప్రకటించింది.

ఇక రెండో జాబితాలో 10మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయవాడ వెస్ట్‌, అవనిగడ్డ, రాజోలు, నర్సాపురం, నిడదవోలు, విశాఖ సౌత్‌, చీరాల, తిరుపతి, గుంటూరు వెస్ట్‌, చీరాల లేదా దర్శిస్థానానికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటు తిరుపతి నుంచి కూడా పోటీకి జనసేన పట్టు బడుతోంది. అంతేకాకుండా.. బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కోసం ప్రయత్నంచేస్తున్నట్లు సమాచారం.. జనసేన పరిశీలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లా బలిజ నేతల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. సరైన అభ్యర్థిని బరిలోకి దించేలా పవన్ కల్యాణ్ ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ రెండో జాబితాలో తను పోటీ చేసే స్థానంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వనున్నారా.? లేదా.? అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ముందస్తుగా కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తర్వాత.. మూడో జాబితాలో పోటీచేసే అన్ని స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకంటించనున్నట్లు సమాచారం.