Nagababu: ‘రోడ్ల పరిస్థితి ఎలా ఉందో… పాలన కూడా అలాగే ఉంది’.. వైసీపీకి నాగబాబు కౌంటర్..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహిపై రోజుకో ఇష్యూ జరుగుతోంది. వెహికిల్ కు పర్మిషన్ లేదని అధికార పక్షం చెబుతుంటే.. వారాహిపైనే తిరుగుతామంటున్నారు జనసేన లీడర్స్. ఇప్పుడు ఇదే విషయం ఏపీ రాజకీయాల్లో...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహిపై రోజుకో ఇష్యూ జరుగుతోంది. వెహికిల్ కు పర్మిషన్ లేదని అధికార పక్షం చెబుతుంటే.. వారాహిపైనే తిరుగుతామంటున్నారు జనసేన లీడర్స్. ఇప్పుడు ఇదే విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో జనసేన లీడర్ నాగబాబు.. వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారాహి యాత్రను ఆపితే పాదయాత్ర చేపడతామని సిద్ధం చేశారు. వారాహి యాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తామన్న ఆయన.. ఇతర పార్టీలతో పొత్తుల విషయంపై స్పష్టత రాలేదని వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో… పాలన కూడా అలాగే ఉందని విమర్శించారు. అనంతపురంలో పర్యటించిన ఆయన.. నగరంలోని చెరువుకట్ట రోడ్డును పరిశీలించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను మట్టి వేయించి, పూడ్పించారు. తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందకెళ్తామని, ఎలాంటి బెదిరింపులకైనా భయపడేది లేదని స్పష్టం చేశారు నాగబాబు.
వైజాగ్‌లో పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ను అనేక ఇబ్బందులు పెట్టారు. అయినా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ఆగలేదు. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా చేయాలనుకున్న పని చేసి తీరుతాం. సమావేశాలు నిర్వహించకుండా జీవో నెం1ను జారీ చేస్తే సరిపోతుందా. అది అమలులో సాధ్యం అవుతుందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి నటన ముందు మా సినీ నటన ఎంత. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో వారే ఇబ్బందులు పడతారు.
– నాగబాబు, జనసేన లీడర్




అంతకుముందు కర్నూలు జిల్లాలో పర్యటించిన నాగబాబు.. వైసీపీ లబ్ధి చేకూర్చేందుకు కొందరు వాలంటీర్లు సంక్షేమ పథకాలు ఇవ్వబోమని, పింఛను ఆపేస్తామని బెదిరిస్తున్నారని, అలాంటివారి మాటలను రికార్డు చేయాలని సూచించారు. అలా చేయడం సరికాదని సూచించారు. జనసేన.. కుటుంబ పార్టీ కాదని, ప్రజల పార్టీ అని నాగబాబు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..