Pawan Kalyan: ఆ పార్టీలతో కలిసి వెళ్లేదే లేదు.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
కొంతమంది వైఎస్ఆర్ కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉన్న కోవర్టుల వల్ల తన అన్నయ్య చిరంజీవి పార్టీని నిలబెట్టుకోలేకపోయారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Pawan Kalyan interesting comments: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము వైసీపీతో కానీ, టీడీపీతో కానీ కలిసి ముందుకు వెళ్లడానికి సిద్ధంగా లేమంటూ పవన్ స్పష్టం చేశారు. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ మూడో ప్రత్యామ్నాయం ఉండాలంటూ పేర్కొన్నారు. కొంతమంది వైఎస్ఆర్ కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉన్న కోవర్టుల వల్ల తన అన్నయ్య చిరంజీవి పార్టీని నిలబెట్టుకోలేకపోయారంటూ వివరించారు. ప్రజారాజ్యం ఉంటే ప్రత్యామ్నాయం ఉండేదని పేర్కొన్నారు. తనను కూడా పార్టీలోకి రమ్మంటే నేను రాను పొమ్మన్నానంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏ సీఎంలకు తాను భయపడనని.. ఇక్కడే ఉంటానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలో మాట్లాడిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎవ్వరికీ భయపడనని.. తన ఆస్థులు లాక్కున్నా నిలబడతానని పవన్ పేర్కొన్నారు.
కాగా.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతకుముందు పవన్.. టీడీపీతో కలిసి వెళ్లడంపై పలుమార్లు బహిరంగంగా మాట్లాడారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తులపై సరైన నిర్ణయం తీసుకుంటామంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే.. ఆయన టీడీపీతో జత కడతారంటూ పలు ఊహాగానాలొచ్చాయి. ఈ క్రమంలో తాజాగా.. పవన్ కల్యాణ్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ రకంగా పవన్ టీడీపీతో పొత్తు ఉండదంటూ చెప్పకనే చెప్పి.. జనసైనికులకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం