Janasena: పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి జనసేన శ్రేణులు ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్ట్‌లపై జనసేన గళమెత్తింది. తిరుపతి అర్భన్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు జనసేన నేతలు, వీరమహిళలు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో చేస్తున్న అసభ్యకర పోస్ట్‌లను నిరసిస్తూ ఆపార్టీ నేతలు తిరుపతిలో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేస్తున్న అసభ్యకర పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలని తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో కంప్లైంట్ చేశారు వీర మహిళలు, జనసేన నేతలు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్న ఐడీలు వెంటనే బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగం తరపున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు వీర మహిళలు.
తిరుపతిలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జనసేన పార్టీ. తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో జనంతోనే.. జనసేన పోస్టర్ రిలీజ్ చేశారు. అలిపిరి పాదాల మండపం దగ్గర కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అవినీతి ప్రభుత్వాన్ని తరిమేద్దాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం నినాదంతో ఇవాళ్టి నుంచి ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని పూజలు చేసింది జనసేన క్యాడర్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..