AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Tension: ఏపీ మంత్రులు జోగి రమేష్, రోజా కార్లపై జనసేన కార్యకర్తల దాడి.. విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్తత..

విశాఖపట్నంలో హైటెన్షన్ నెలకొంది. విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర జనసైనికులు మంత్రుల కార్లపై దాడికి దిగారు. దీంతో ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Vizag Tension: ఏపీ మంత్రులు జోగి రమేష్, రోజా కార్లపై జనసేన కార్యకర్తల దాడి.. విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్తత..
Vizag Airport
Shaik Madar Saheb
|

Updated on: Oct 15, 2022 | 5:21 PM

Share

విశాఖపట్నంలో హైటెన్షన్ నెలకొంది. విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర జనసైనికులు మంత్రుల కార్లపై దాడికి దిగారు. దీంతో ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో జనసైనికులు విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇదే సమయంలో రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా.. వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు తిరిగి వెళుతుండగా.. అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై దాడికి దిగారు.

జోగిరమేష్‌, రోజా, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు విరుచుకుపడ్డారు. కార్లపై దాడి చేసి.. మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జనసేన కార్యకర్తల దాడిలో జోగి రమేష్‌ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి తీవ్రగాయాలైనట్లు పేర్కొంటున్నారు.

కాగా.. ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఇది మంచి పద్దతి కాదంటూ పేర్కొన్నారు. జనసేన దాడిలో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్ కూడా విశాఖకు చేరుకున్నారు. మరికాసేపట్లో భారీ ర్యాలీ కూడా ప్రారంభం కానుంది. తాజా ఘటనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పవన్ క్షమాపణలు చేప్పాలి..

వైవి సుబ్బారెడ్డి, జోగి రమేష్ లపై విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!