జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల గుర్తును ప్రకటించిన మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ
విశాఖ ఎంపిగా లోక్ సభలో అడుగుపెట్టాలని కలలు కన్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీ నారాయణ సడన్‌గా ప్లాన్ మార్చారు. పార్లమెంట్‌కు వెళ్ళడం ఇప్పట్లో సాధ్యం కాదని అనుకున్నారో ఏమో కానీ అసెంబ్లీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. అది కూడా విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి. రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అంటూ స్వయంగా ప్రకటించారు జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ.

విశాఖ ఎంపిగా లోక్ సభలో అడుగుపెట్టాలని కలలు కన్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీ నారాయణ సడన్‌గా ప్లాన్ మార్చారు. పార్లమెంట్‌కు వెళ్ళడం ఇప్పట్లో సాధ్యం కాదని అనుకున్నారో ఏమో కానీ అసెంబ్లీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. అది కూడా విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి. రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం నార్త్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అంటూ స్వయంగా ప్రకటించారు జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ. తాజాగా ఆయన విశాఖలో ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి విశాఖ లోనే మకాం వేశారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసం యునైటెడ్ ఫ్రంట్ ఆవశ్యకత ఉందని, రెండు పార్టీలు, రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న పొలిటికల్ డ్రామాకు తెరదించాలని యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందుకే లక్ష్మీ నారాయణ అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 2019లో జనసేన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు మూడు లక్షల ఓట్లు పొందానని, ప్రస్తుతం తన అవసరం రాష్ట్రానికి ఎక్కువగా ఉన్నందున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు వివరించారు.
టార్చ్ లైట్ గుర్తు కేటాయింపు..
జై భారత్ నేషనల్ పార్టీ ఎన్నికల గుర్తుగా టార్చి లైట్‌ను ఎన్నికల సంఘం కేటాయించింది. దీంతో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్‌గా టార్చిలైట్‌ను కేటాయిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేశారు. అలాగే చీకటిలో ఉన్న రాష్ట్రానికి వెలుతురు పంచే విధంగా టార్చి లైట్ సింబల్ కేటాయించారని లక్ష్మీ నారాయణ అన్నారు.
పోటీ చేసేది వీళ్ళే..
భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటింతో కలిపి లక్ష్మీ నారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన యునైటెడ్ ఫ్రంట్ తరఫున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని, ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు శివ భాగ్య రావు బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని లక్ష్మీ నారాయణ తెలిపారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల స్థానిక పరిపాలన గాడితప్పిందన్న లక్ష్మీనారాయణ చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…








