Andhra Pradesh: వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన షర్మిల

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై నేటికీ ఐదేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో ఆయన కూతురు సునీతా రెడ్డి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన వివేకానంద రెడ్డి ఆత్మీయులు సన్నిహితులతోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఆత్మీయ సమావేశం కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

Andhra Pradesh: వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన షర్మిల
Ys Vivekananda Reddy Vardhanti
Follow us
Sudhir Chappidi

| Edited By: Balaraju Goud

Updated on: Mar 15, 2024 | 4:26 PM

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురై నేటికీ ఐదేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో ఆయన కూతురు సునీతా రెడ్డి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన వివేకానంద రెడ్డి ఆత్మీయులు సన్నిహితులతోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఆత్మీయ సమావేశం కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సునీత రెడ్డి పొలిటికల్ ఎంట్రీ పై ఈ సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారని ఉద్దేశంతోనే చాలామంది నేతలు కూడా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. అయితే వారందరికీ సునీత పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఓ క్లారిటీ ఇచ్చారు.

వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని తన నివాసంలో అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడిన ఈ అంశం మాట్లాడకుండా ఎవరు ప్రసంగించారు. అలాంటి వివేకానంద రెడ్డి హత్య జరిగి నేటికీ ఐదు సంవత్సరాలు గడిచింది. అందులో భాగంగానే ఆయన కుమార్తె వైఎస్ సునీత రెడ్డి వారి కుటుంబంతో సన్నిహితంగా ఆత్మీయంగా ఉండే నేతలతో కడపలోని జయరామ గార్డెన్స్‌లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సునీత అక్క సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, పీసీసీ చీఫ్ షర్మిల కూడా హాజరయ్యారు. అంతేకాక తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చి సునీతకు సానుభూతి తెలియజేసి వివేకానంద రెడ్డికి నివాళులు అర్పించారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబానికి అన్ని పార్టీల తరఫున అండదండలు ఉంటాయని తెలిపారు.

ముఖ్యంగా ఎవరైతే ఈ హత్య కేసులో నిందలు ఆరోపించబడ్డ ఆదినారాయణ రెడ్డి సైతం ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చి సునీత వెంటే ఉంటామని చెప్పడం సంచలనంగా మారింది. సునీత రాజకీయ జీవితంపై ఆలోచించి కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవాలని, దానికి పార్టీలకు అతీతంగా ఆమెకు తోడుగా ఉంటామని తెలిపారు. ఇక సందర్భంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

కష్ట కాలంలో అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యులే తనను నిందితురాలిగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. ఎవరు అండగా ఉన్నా లేకపోయినా సునీతకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆస్తి కోసమో అధికారం కోసమో ఈ మాటలు చెప్పడం లేదని, సునీతను చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టే తన బాధను అర్థం చేసుకున్నానన్నారు. సునీతకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తన కుటుంబానికి మాట ఇస్తున్నానని షర్మిల భావోద్వేగంతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి కోప్పడడమే ఇంతవరకు నేను చూడలేదని, అలాంటిది ఆయనకి అంత క్రూరమైన చావు రావడం తట్టుకోలేకపోతున్నానని షర్మిల అన్నారు.

ఇక తను రాజకీయాల్లోకి వస్తానా లేదా అనేది ముఖ్యం కాదని, కానీ ప్రజాక్షేత్రంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని వైఎస్ సునీత అన్నారు. వచ్చే ఎన్నికలలో మాత్రం అన్న వైఎస్ జగన్‌కు మాత్రం ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. తద్వారా నాకు జ్యూడిషరీలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని సునీత అన్నారు. చివరికి పోటీ చేస్తానా లేదా అనేదానిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు సునీత రెడ్డి. అయితే సునీత పొలిటికల్ ఎంట్రీపై షర్మిల స్పందిస్తూ.. సునీత నాతోనే నా వెంటే ఉన్నారని త్వరలోనే క్లారిటీ ఇస్తానని షర్మిల స్పష్టం చేశారు. అంటే సునీత కాంగ్రెస్‌లోనే ఉన్నట్టా? అనేదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…