Puttaparthi: పుట్టపర్తిలో చైనా న్యూ ఇయర్ వేడుకలు.. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో చైనీయులు సందడి
సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ సత్యసాయి మహా సమాధి దగ్గర జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల సందర్భంగా.. చైనీయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
ల్యూనార్ కాలెండర్ ప్రకారం చైనా కొత్త సంవత్సరం జనవరి 22న వస్తుంది. తాజాగా చైనీయులు కుందేలు నామ సంవత్సరంలో అడుగు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా చైనీయులు నూతన సంవత్సరాన్ని వైభవంగా జరుపుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో.. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు చైనీయులు. సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ సత్యసాయి మహా సమాధి దగ్గర జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల సందర్భంగా.. చైనీయులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
చైనా సాంప్రదాయ పద్ధతిలో వేషదారణతో సంగీత గాన కచేరి చేశారు. ఆట పాటలతో సందడి చేశారు. సాయికుల్వంత సభామండపంలోని మహాసమాధిని చైనా భక్తులు ప్రత్యేకంగా అలంకరించారు. చైనా నుంచి తీసుకొచ్చిన పుష్పఫలహారాలను సత్యసాయికి నివేదించారు. చైనా భక్తులతో నూతన శోభను సంతరించుకుంది ప్రశాంతి నిలయం. చాంద్రమానం ప్రకారం చైనీయులు నూతన సంవత్సర వేడుకలు భారతీయ సంప్రదాయాన్నీ అనుసరించి మహిళలు చీరలు ధరించారు. పురుషులు ధోతీని ధరించారు. చైనా సంప్రదాయం ప్రకారం 12 రాశుల్లో ఒక్కొక్కదాని పేరు ఒక్కొక్క సంవత్సరానికి వస్తుంది. ఈ సంవత్సరం కుందేలు నామ సంవత్సరం అయింది. నూతన సంవత్సర వేడుకలను స్ప్రింగ్ ఫెస్టివల్ అని పిలుస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..