Andhra Pradesh: అటు జంపింగ్‌లు.. ఇటు జాయినింగ్‌లు.. ఏపీలో ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలందరూ ప్రచార హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ఆరోపణలతో హీట్ పుట్టిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. టిక్కెట్ దక్కని నేతలు ఆయా పార్టీలకు షాకిస్తున్నారు. ముఖ్యంగా.. కూటమిలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా అధికార వైసీపీ గూటికి చేరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలందరూ ప్రచార హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ఆరోపణలతో హీట్ పుట్టిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. టిక్కెట్ దక్కని నేతలు ఆయా పార్టీలకు షాకిస్తున్నారు. ముఖ్యంగా.. కూటమిలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా అధికార వైసీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు షాక్ తగిలింది. అమలాపురం జనసేన మాజీ ఇన్‌చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు.. నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు. ఇక.. అమలాపురం జనసేన సీటు దక్కకపోవడంతో కొద్దిరోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేశారు శెట్టిబత్తుల రాజబాబు. ఈ క్రమంలోనే.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజబాబుతోపాటు అమలాపురం జనసేన పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తల కూడా వైసీపీలో చేరారు.
మరోవైపు.. అనంతపురం జిల్లా శింగనమలలో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే యామినిబాల వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు.. రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా వైసీపీ అధిష్టానానికి పంపారు. ఇక.. ఇప్పటివరకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే యామినిబాల. 2018 మార్చిలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు యామినిబాల.
అప్పటినుంచి శింగనమల టిక్కెట్ ఆశిస్తూ వస్తున్నారు. అయితే.. రాజకీయ, సామాజిక సమీకరణాల్లో భాగంగా తాజాగా వీరాంజనేయులు అనే వ్యక్తికి టిక్కెట్ కేటాయించారు సీఎం జగన్. అప్పటినుంచి అసంతృప్తిగా ఉంటున్న యామినిబాల.. శింగనమల సీటు దక్కకపోవడంతో వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో.. రాజకీయ భవిష్యత్‌పై యామినిబాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..