AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మంచంపై నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన కోతి.. కొద్ది దూరం ఈడ్చుకెళ్లి.. చివరకు..

అడవుల్లో నుంచి జనావాసాల్లోకి చొరబడుతున్న కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంట్లోకి వెళ్లి వస్తువులను పడేయడం, చిందరవందర చేయడం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం కామన్ అయిపోయాయి...

Andhra Pradesh: మంచంపై నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన కోతి.. కొద్ది దూరం ఈడ్చుకెళ్లి.. చివరకు..
Monkey Attack
Ganesh Mudavath
|

Updated on: Dec 02, 2022 | 10:28 AM

Share

అడవుల్లో నుంచి జనావాసాల్లోకి చొరబడుతున్న కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంట్లోకి వెళ్లి వస్తువులను పడేయడం, చిందరవందర చేయడం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం కామన్ అయిపోయాయి. పంట పొలాలపై కూడా తమ ప్రతాపం చూపిస్తున్నాయి. మొక్కలను పీకేయడం, పంట ఉత్పత్తులను నాశనం చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ భయానక వాతావరణం కలిగిస్తున్నాయి. ఇంత వరకు ఓపిక పట్టాం.. కానీ అవే కోతులు.. ప్రజలు,చిన్నారుల ప్రాణాలు తీసేందుకూ వెనకాడటం లేదు. ఏం జరుగుతుందో ఏమో.. ఇంటి బయట ఉండే చిన్నారులపై విశ్వరూపం చూపిస్తున్నాయి. వారిని ఎత్తుకెళ్లి, ఎత్తైన ప్రదేశాల నుంచి పడేస్తున్నాయి. వారి ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. మంచంపై నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన కోతి కొద్ది దూరం తీసుకెళ్లి పడేసింది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలై.. కొద్ది సమయంలోనే ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోంది.

ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని మురుగమ్మి గ్రామంలో రవీంద్ర, సుమతి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. రవీంద్ర భవన నిర్మాణ మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. చిన్న కుమార్తెకు ఇటీవలే రెండు నెలలు నిండి మూడో నెల వచ్చింది. ఈ క్రమంలో చిన్నారిని ఇంటి ఆవరణలో మంచం మీద పడుకోబెట్టి తల్లి ఇంటి పనులు చేసుకుంటోంది.

ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ కోతి పాపను ఎత్తుకెళ్లింది. కొద్దిదూరం ఈడ్చుకెళ్లి కింద పడేసింది. చిన్నారి ఏడుపు విని, తల్లి వచ్చి చూసే సరికే రక్తపు మడుగులో ఉన్న బిడ్డను చూసి భయంతో కేకలు వేసింది. కాపాడేందుకు ఆస్పత్రికి తరలిస్తుండగా.. కొన్ని క్షణాల్లోనే చిన్నారి మృత్యు ఒడికి చేరిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్న ఏపీ న్యూస్ కోసం

Follow Us
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి