Today Mirchi Price: ఒక్కసారిగా భారీగా పెరిగిన మిర్చి ధర.. రైతులు ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం

వింత వైరస్ కారణంగా గత ఏడాది మిర్చి పంట బాగా దెబ్బతింది. దీంతో ఖర్చుల కోసం చాలామంది రైతులు పంటను అమ్ముకున్నారు. ఆ డబ్బు పెట్టిన పెట్టుబడికి కూడా సరిపోలేదు. కాస్త చేతి మెల్ల ఉన్న రైతులు మాత్రం పంటను ఏసీల్లో దాచుకున్నారు.

Today Mirchi Price: ఒక్కసారిగా భారీగా పెరిగిన మిర్చి ధర.. రైతులు ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం
Today Mirchi Price
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 02, 2022 | 12:13 PM

ఈ ఏడాది మిర్చి రైతులు ఆనందంగా లేరు. ఓ వైపు వర్షాలు, వరదలతో పంటకు నష్టం వాటెల్లింది. మరోవైపు మాయదారి రోగాలతో దిగుబడి దండిగా తగ్గిపోయింది. ఉన్న పంటకు ఇప్పటివరకు ఓ మోస్తారు ధర ఉంది. దీంతో పెట్టుబడి డబ్బులు వస్తే చాలు అనుకుని చాలామంది రైతులు పంటను అమ్ముకున్నారు. కొందరు మాత్రం మంచి ధర వస్తుందేమో అని కోల్డ్ స్టోరేజీలలో నిల్వ చేశారు. అయితే ప్రజంట్ ఒక్కసారిగా మిర్చి ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో మేలు రకం ఎండుమిర్చికి అత్యధికంగా. 32, 059 ధర పలికింది. ఒక్కరోజు ముందు ఈ ధర ధర 28,000గా ఉంది.

ఒక్కరోజు వ్యవధిలో 4వేల రూపాయలు పెరగడంతో రైతుల ముఖాల్లో నవ్వులు విరిశాయి. ఇక మీడియం రకం మిర్చి ధర రూ.16,500 నుంచి 20 వేల వరకు ఉంది. కాగా  గుంటూరు తర్వాత కర్నూలు మార్కెట్ లోనే అత్యధికంగా ఎండుమిర్చి క్రయవిక్రయాలు జరుగుతాయన్న విషయం తెలిసిందే.

వేరుశనగ రేటు కూడా పెరిగింది. మేలు రకం క్వింటానికి రూ.7,869 అమ్ముడయ్యింది. మిడియం క్వాలిటీ ధర రూ.6,097, ఉండగా… కనిష్ట ధర రూ.2,712 గా ఉంది. దీంతో వేరుశనగా రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురువారం మొక్కజొన్నలు గరిష్టంగా క్వింటా రూ.2,119, ఆముదాలు క్వింటా గరిష్ట ధర రూ.6,501 పలకగా, క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.1,959లకు అమ్ముడయ్యింది.

మరిన్న ఏపీ న్యూస్ కోసం