AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mekapati: ఎమ్మెల్యేనే నా తండ్రి.. ఎవరిని అడిగిన ఇదే చెబుతారు.. మరింత ముదురుతున్న ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి కొడుకు వివాదం

నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొడుకు వివాదం మరింత ముదురుతోంది. ఎమ్మెల్యే మేకపాటి తన తండ్రి అంటూ తాజాగా లేఖ విడుదల చేశారు శివచరణ్‌రెడ్డి.

Mekapati: ఎమ్మెల్యేనే నా తండ్రి.. ఎవరిని అడిగిన ఇదే చెబుతారు.. మరింత ముదురుతున్న ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి కొడుకు వివాదం
Mla Mekapati Chandrasekhar Reddy
Sanjay Kasula
|

Updated on: Jan 08, 2023 | 11:42 AM

Share

మేకపాటి కుటుంబాన్ని మరో వివాదం చుట్టుకుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి ప్రతినిథ్యం వహిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై విడుదల చేసిన ఓ లేఖ సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొడుకు వివాదం మరింత ముదురుతోంది. ఎమ్మెల్యే మేకపాటి తన తండ్రి అంటూ తాజాగా లేఖ విడుదల చేశారు శివచరణ్‌రెడ్డి. అయితే, ఆ బహిరంగ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాలను చుట్టేస్తోంది. లేఖతో పాటు, పాత ఫొటోలు కూడా చర్చకు కారణంగా మారుతున్నాయి. అయితే, శివచరణ్‌ రెడ్డి తన కొడుకు కాదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడి చెప్తున్నారు. డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడనేది ఆయన ఆరోపణ.. శివచరణ్‌తో సంబంధంలేదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించి మరిన్ని ఆధారాలు బయటపెట్టిన శివచరణ్‌.. తమ సొంత ఊరు కంప సముద్రంలో ఎవరిని అడిగినా వాస్తవం చెబుతారంటున్న శివచరణ్‌ రెడ్డి తెలిపారు.

తన సర్టిఫికెట్లన్నింటిలో మేకపాటి పేరు ఉందని ఆధారాలు చూపిస్తున్నారు శివచరణ్‌. ఇటీవల తనకి కుమారుడే లేడని చంద్రశేఖర్ రెడ్డి చెప్పడంపై తన లేఖ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశాడు శివచరణ్‌రెడ్డి. మరి నేను ఎవ్వరిని అంటూ లేఖలో ప్రశ్నించాడు. చదువుకి ఫీజులు చెల్లించడంతో బాధ్యత తీరుతుందా? అంటూ సూటి‌ ప్రశ్నలు సంధించాడు.

ఇక, తన తల్లి తర్వాత పరిచయమైన ఆమెని సమాజానికి‌ పరిచయం చేశావంటూ పేర్కొన్నారు శివచరణ్‌ రెడ్డి. కుమారుడిగా తనని ఒప్పుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నాడు శివచరణ్ రెడ్డి. అయితే, ఈ బహిరంగ లేఖపై ఇప్పటి వరకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్‌ రాలేదు.. ఆయన ఎలా స్పందిస్తారు? అనే విషయం ఆసక్తికరంగా మారగా.. ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు మేకపాటి కుటుంబంలో కలకలం రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం