AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రోడ్డుపై వేగంగా కారు పరుగులు.. వెనకాలే రక్షణగా టూవీలర్స్.. ఆపి చూసిన పోలీసులు షాక్..!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో నిఘాను ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆనందపురం సమీపంలోని భీమిలి క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది.

Andhra Pradesh: రోడ్డుపై వేగంగా కారు పరుగులు.. వెనకాలే రక్షణగా టూవీలర్స్.. ఆపి చూసిన పోలీసులు షాక్..!
Illegal Currency Gold,
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: May 03, 2024 | 9:21 AM

Share

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో నిఘాను ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆనందపురం సమీపంలోని భీమిలి క్రాస్ రోడ్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. వాటికి రక్షణగా రెండు టూవీలర్లు కూడా వెళ్తుండటంతో పోలీసులు ఆపారు. ఇంకేముంది, అందులో కనిపించిన సీన్ చూసిన పోలీసులకు కళ్ళు జిగేల్ మన్నాయి.

కారు, టూ వీలర్ ‌పై ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పొంతన లేని సమాధానం చెప్పేసరికి.. కారుతో పాటు టూ వీలర్‌ను తనిఖీల చేశారు. దీంతో కరెన్సీ నోట్లు, గోల్డ్ కాయిన్ బిస్కెట్లు, మారణాయుధాలు కనిపించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాఖ భీమిలి క్రాస్ రోడ్ ఆనందపురం చెక్ పోస్టు వద్ద తనీఖీలు చేస్తున్న పోలీసులకు.. అనుమానాస్పదంగా కారు కనిపించింది. ఆ వెంటే మరో రెండు ద్విచక్ర వాహానాలను కూడా ఆపారు పోలీసులు. కారులో ఉన్న ముగ్గురితో పాటు స్కూటీపై మరొకడు బైక్‌పై మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించేసరికీ పొంతనలేని సమాధానం చెప్పారు. అనుమానాస్పదంగా ఉండడంతో వాహనాలు తనిఖీ చేసేసరికీ, 10 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, కాపర్ తో తయారు చేసిన గోల్డ్ కోటెడ్ బిస్కెట్లు, కాయిన్లు, 22 సెల్ ఫోన్లు, లాప్‌టాప్ బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు.

వీటితోపాటు రైస్ పుల్లింగ్ బౌల్, కత్తులు, మరణాయుధాలను కూడా సీజ్ చేశారు పోలీసులు. నిందితుల్లో హేమచంద్రరావు, సునీల్, శ్రీను, హేమంత్ కుమార్, శ్రీనివాస్ విజయనగరం పరిసర ప్రాంతాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాలోచనతో అంతా కలిసి ఒక ప్లాన్ వేసినట్టు గుర్తించారు పోలీసులు. ఇల్లు నిర్మించేందుకు తవ్వకాల జరుపుతుండగా అక్కడ ఈ గోల్డ్ కాయిన్లు, బిస్కెట్లు బయటపడ్డాయని, మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకు అమ్మేస్తామని ఆశ చూపి మోసం చేసేందుకు సిద్ధమైనట్టు ఏసీపీ సునీల్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…