మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం..

శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. కాగా శ్రీశైలం దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు ఆదేశాల మేరకు పర్యవేక్షకుడు అయ్యన్న అలానే పారిశుద్ధ్యపు సిబ్బందితో దేవస్థానం చెక్ పోస్టు వద్ద ప్లాస్టిక్ బాటిళ్ళను, శ్రీశైల చెత్త చెదారాన్ని తీసివేసి శుభ్ర పరిచారు. అలాగే వివిధ వాహనాలను తనిఖీ చేసి ప్లాస్టిక్ బాటిళ్ళను క్షేత్రపరిధిలోకి తీసుకురాకుండా చర్యలు తీసుకున్నారు.

మల్లన్న భక్తులకు అలెర్ట్.. శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం..
Plastic Ban In Srisailam
Follow us

|

Updated on: May 03, 2024 | 8:41 AM

ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు, అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. కాగా శ్రీశైలం దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు ఆదేశాల మేరకు పర్యవేక్షకుడు అయ్యన్న అలానే పారిశుద్ధ్యపు సిబ్బందితో దేవస్థానం చెక్ పోస్టు వద్ద ప్లాస్టిక్ బాటిళ్ళను, శ్రీశైల చెత్త చెదారాన్ని తీసివేసి శుభ్ర పరిచారు. అలాగే వివిధ వాహనాలను తనిఖీ చేసి ప్లాస్టిక్ బాటిళ్ళను క్షేత్రపరిధిలోకి తీసుకురాకుండా చర్యలు తీసుకున్నారు.

స్థానికులు, వ్యాపారులు,హోటళ్ళ నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి బదులు కాగితపు కవర్లు, గుడ్డ సంచులు, జ్యూట్ బ్యాగులు వినియోగించుకోవాలని సూచించారు ప్రధానంగా ప్లాస్టిక్ మంచినీటి బాటిళ్ల బదులుగా మట్టి, స్టీలు, రాగి సీసాలను వినియోగించాలని కోరారు. ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం క్షేత్రంలో పలుచోట్ల ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిందని తెలిపారు.  స్థానికులు, వ్యాపారులు, హోటళ్ళ నిర్వాహకులు, ప్రవేట్ సత్రాల నిర్వాహకులు అందరూ ప్లాస్టిక్ నిషేధంపై దేవస్థానానికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆలయ ఈవో పెద్దిరాజు కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles