Andhra Pradesh: బీఎస్ఎన్ఎల్, ఈసీఐలో జాబ్ కావాలా..? అంటూ ప్రకటన ఇచ్చారు.. చివరకు

విజయవాడలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. డయల్ ఇనిస్టిట్యూట్ పేరిట మోసం వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయలు వసూలు చేశారు.

Andhra Pradesh: బీఎస్ఎన్ఎల్, ఈసీఐలో జాబ్ కావాలా..? అంటూ ప్రకటన ఇచ్చారు.. చివరకు
Vijayawada Fraud
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 15, 2022 | 8:25 AM

విజయవాడలో ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. డయల్ ఇనిస్టిట్యూట్ పేరిట మోసం వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయలు వసూలు చేశారు. నిరుద్యోగులే టార్గెట్ గా మోసానికి తెరలేపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ బందరు రోడ్డులో డయల్ ఇనిస్టిట్యూషన్ పేరుతో ఒక ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. విజయదుర్గా, వైశాలి, ఇషా, సిద్ధార్ధ దండేబోయిన కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్ లైన్ లో లోకల్ యాప్ ద్వారా ప్రకటనలిచ్చారు. అది చూసిన నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు పెట్టారు.. యాప్ లో చూసిన వారు వెంటనే కాల్ చేస్తే బిఎస్ఎన్ఎల్, కార్గో, అమెజాన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా పేర్లు చెప్పారు.. వాళ్ళతో మాకు కాంట్రాక్టు ఉందంటూ నమ్మించారు.

ఒకసారి వస్తే మాట్లాడదాం అంటూ బాధితులను మభ్యపెట్టారు. వారు వచ్చి మాట్లాడిన అనంతరం.. డబ్బులు ఖర్చవుతాయని నమ్మించారు. ఇలా వేలల్లో మొదలెట్టి రూ. లక్షల్లో వసూలు చేసారు. వచ్చిన ప్రతీ ఒక్కరినీ అప్లికేషన్ తో పాటు మనీ కట్టాలని అడిగారు. అడిగిన సొమ్ము మొత్తం అప్లికేషన్ ఫీజ్, రిజిస్ట్రేషన్ ఫీజ్, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట వసూళ్ళు చేసారు. అనంతరం ఫోన్ ఆఫ్‌ చేసుకొని పరారయ్యారు. ఇక మళ్లీ డబ్బులు అవసరం వచ్చినపుడు అ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం అంటూ నమ్మించారు.

ఇందులో మొత్తం 40 మందికి పైగా నిరుద్యోగులను నమ్మించి మోసం చేసారు. ఇక 40 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైన నిరుద్యోగులు ఇలాంటి జాబులు ఇప్పిస్తామంటే నమ్మి మోసపోవద్దు అని చెబుతున్నారు. బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!