East Godavari District: తూర్పు గోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. వంటింట్లో పేలిన గ్యాస్ సిలిండర్
ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడటంతో జనాలు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు గ్రామస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అలాగే ఆస్తినష్టం మాత్రం బాగానే జరిగినట్టు అంచనా వేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. తూర్పు గోదావరి జిల్లాలో నల్లజర్ల గ్రామంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడటంతో జనాలు పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు గ్రామస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అలాగే ఆస్తినష్టం మాత్రం బాగానే జరిగినట్టు అంచనా వేస్తున్నారు. మంటలు ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తుండగానే తొమ్మిది ఇల్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యి పరుగులు పెట్టారు.