CM YS Jagan: సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ఖరారు.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 23, 24, 25 మూడు రోజుల పాటూ తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా, కొన్ని పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొన్ననున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్ ను ఖరారు చేసింది.

CM YS Jagan: సీఎం జగన్ కడప జిల్లా పర్యటన ఖరారు.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..
Cm Ys Jagan
Follow us

|

Updated on: Dec 21, 2023 | 10:15 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 23, 24, 25 మూడు రోజుల పాటూ తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా, కొన్ని పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. క్రిస్మస్ వేడుకల్లో కూడా పాల్గొన్ననున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్ ను ఖరారు చేసింది.

23న ఉదయం 9.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా కడప చేరుకుంటారు. కడప చేరుకున్న వెంటనే డిప్యూటీ సీఎం అంజద్ బాషా, నగర మేయర్ తోపాటు పలువురు ముఖ్య నేతలు స్వాగతం పలకనున్నారు. ఆ తరువాత గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‎పీఎల్ ప్లాంటులను ప్రారంభించనున్నారు. ఆ సంస్థకు చెందిన చైర్మన్ తోపాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ వైఎస్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ యూనిట్, డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్, ఎల్‎వీ ప్రసాద్ కంటి ఆసుపత్రితోపాటు.. రిమ్స్‎కి సమీపంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లను ప్రారంభిస్తారు. ఆ తరువాత నవీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, సుందరంగా తీర్చిదిద్దిన అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్స్ కు ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తరువాత నేరుగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ కి చేరుకొని ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.

24 న ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి నేరుగా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్దకు చేరుకుంటారు. దివంగత నేతకు నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషాతోపాటూ కడప నగర మేయర్ సురేష్ బాబు పలువురు జిల్లా ఇంఛార్జిలు, ముఖ్యనేతలు పాల్గొంటారు. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని గతంలో శంకుస్థాపన చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తారు. తిరిగి సాయంత్రం ఇడుపులపాయ ఎకో పార్క్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన పులివెందుల ఎంపీటీసీ నేతలతో మాటా మంతి నిర్వహిస్తారు. తిరిగి వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే సిద్దం చేశారు.

ఇవి కూడా చదవండి

25న క్రిస్మస్ రోజు ఇడుపులపాయ గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తరువాత స్థానిక ముఖ్యనేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించి తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు. సాయంత్రం లేదా రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..