Purandareswari: పురందరేస్వరీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పార్టీ అధ్యక్షులు పదవి నుంచి తప్పుకుంటున్నారా..? లేక అధిష్టానమే మర్చాలనుకుంటుందా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆమెపై పెట్టుకున్న అంచనాలు అందుకు పూర్తిగా బిన్నంగా ఉన్నాయి. దీంతో చిన్నమ్మను పక్కన పెట్టేందుకు ఆపార్టీ అగ్ర నేతలు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ లో చర్చ జరుగుతుంది.

Purandareswari: పురందరేస్వరీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం ఎంత ?
Daggubati Purandeswari
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Dec 21, 2023 | 1:22 PM

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా తెలుగు దేశం, జనసేన పొత్తు ఖాయం చేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ సైతం తమతో కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నాయి. బీజేపీ అధినాయకత్వం నుంచి అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు. దీంతో.. కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పార్టీ అధ్యక్షులు పదవి నుంచి తప్పుకుంటున్నారా..? లేక అధిష్టానమే మర్చాలనుకుంటుందా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆమెపై పెట్టుకున్న అంచనాలు అందుకు పూర్తిగా బిన్నంగా ఉన్నాయి. దీంతో చిన్నమ్మను పక్కన పెట్టేందుకు ఆపార్టీ అగ్ర నేతలు కసరత్తు చేస్తున్నట్లు పార్టీ లో చర్చ జరుగుతుంది. ఇటీవల నాలుగు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా అధ్యక్షుల మార్పులు చేపట్టిన బీజేపీ అగ్ర నాయకత్వం ఏపి, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్ అధ్యక్షుల మార్పులు చేపట్టగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ లేకపోయినా ఆమెను అధ్యక్షురాలిగా నియమించారు.

మాజీ కేంద్ర మంత్రిగా, దివంగత మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా, సామాజికంగా, రాజకీయంగా తనకంటూ ప్రత్యేక చరిష్మా ఉన్న పురంధేశ్వరి, ఏపీ బీజేపీకి ఉపయోగ పడుతుందని భావించిన బీజేపీ హైకమాండ్ ఆమె ఏపీ బాధ్యతలు అప్పగించింది. అయితే ప్రస్తుతం బీజేపీలో నెలకొన్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్న చర్చ ఆ పార్టీలో పెద్ద ఎత్తున్న నడుస్తోంది. బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మార్చేందుకు చిన్నమ్మ అడుగులు వేస్తారని భావిస్తే అటువంటి పరిస్థుతులు పార్టీలో ఎక్కడ లేవని అంటున్నారు సొంత పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా చిన్నమ్మను మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆశించిన లక్ష్యం దిశగా చిన్నమ్మ అడుగులు పడకపోగా, పార్టీలోని సీనియర్లు మాత్రం ఆమెపై గుర్రుగా ఉన్నారు. వరుసగా కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళి పిర్యాదులు చేస్తున్నారు. దీంతో చిన్నమ్మ పార్టీలో ఎన్ని మార్పులు చేసినా ఎలా అడుగులు వేసిన బీజేపీ చీఫ్ మార్పు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.

బీజేపీ అద్యక్షురాలుగా మార్పు విషయంలో జరుగుతున్న చర్చలో ప్రధానంగా కొన్ని అంశాలు కారణంగా తెలుస్తోంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి పెద్ద చర్చకు కారణమయ్యారు. కాగా అటు ప్రభుత్వం వైపు నుంచి సైతం అదే స్థాయిలో విమర్శలు మూట గట్టుకున్నారు. రాజకీయంగా సీనియర్ నేతగా ఉన్న పురందరేశ్వరి పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించడంలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించడం, టీడీపీ తప్పులను ఎత్తి చూపడం తద్వారా పార్టీకి మేలు చేస్తాయని భావిస్తే, ఆదిశగా అడుగులు చిన్నమ్మ వేయలేదని బావిస్తున్నారు.

పార్టీలో సీనియర్లుగా ఉన్న జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, సత్య కుమార్ తోపాటు మాజీ మంత్రుల మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో కలుపు పోవడం లేదన్న వాదనలు ఉన్నాయి. పైగా ఇటీవల జిల్లాల పర్యటనలో భాగంగా ఆయా జిల్లాలో ఉన్న సీనియర్లకు కనీసం సమాచారం సైతం ఇవ్వడం లేదని అంటున్నారు నేతలు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీతో సమదూరం పాటిస్తున్న బీజేపీ, టీడీపీ నుంచి చేరికల విషయంలో చిన్నమ్మ లైట్ తీసుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా పార్టీకి ప్రయోజనం లేని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పార్టీకి ప్రయోజనం లేదని భావిస్తున్నారట కమలం పార్టీ నేతలు. పైగా ఇటీవల జరిగిన పలు పరిణామాలు కూడా అధ్యక్ష మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా సీనియర్లు అంత ఏపీ బీజేపీలో నెలకొన్న పరిణామాలను అన్నిటినీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది.

పురందరేశ్వరిని తప్పించి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడుగా నియమించాలని బీజేపీ అగ్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలు పరిపాలన పరమైన అన్ని అంశాలపై అవగాహన ఉండటం రాయలసీమకు చెందిన నేత కావడం ఆయన రాక తరువాత పార్టీ ఎస్టాబ్లిష్ కావడానికి అవకాశం ఉందని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. పైగా సౌమ్యుడుగా వివాద రహితుడిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడుగా నియమిస్తే, పార్టీ సమూలంగా ప్రక్షాళన జరుగుతుందని కొందరు నేతలు భావిస్తున్నారు.

ఇప్పటికే దక్షిణాదిపై గురి పెట్టిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక ,రాజకీయ పరిణామాల దృష్ట్యా, ఆయన్ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి మరింత మేలు చేకూరుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. అందులో భాగంగా బీజేపీ చీఫ్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తే త్వరలో పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టి ప్రక్షాళన చేసేలా అడుగులు వేస్తూన్నారట బీజేపీ అగ్ర నేతలు. కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తే అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ, వైసీపీలోనీ అసంతృప్త నేతలు మొత్తం బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. మరోవైపు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తే బీజేపీకి లబ్ధి చేకూరుతుందని కమలనాథులు భావిస్తున్నారట.

మొత్తానికి మరోసారి బీజేపీ అధ్యక్ష మార్పు వ్యవహారంపై పెద్ద చర్చ నడుస్తోంది. చూడాలి మరీ సార్వత్రిక ఎన్నికల వరకు చిన్నమ్నను కొనసాగిస్తారా లేక కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారా ? అనేదీ..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
గంభీర్ శిష్యుడి దెబ్బకు గేల్ చరిత్రకు ఎండ్ కార్డ్
గంభీర్ శిష్యుడి దెబ్బకు గేల్ చరిత్రకు ఎండ్ కార్డ్
ఆల్కహాల్‌తో పాటు పండ్లను తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..
ఆల్కహాల్‌తో పాటు పండ్లను తీసుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
త్వరలోనే 'స్థానిక' ఎన్నికల నగారా.. అమీతుమీకి సిద్ధం..
త్వరలోనే 'స్థానిక' ఎన్నికల నగారా.. అమీతుమీకి సిద్ధం..
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అభిమానులకు చిరంజీవి సూచనలు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అభిమానులకు చిరంజీవి సూచనలు..
Video: పాకిస్తాన్ ఫీల్డింగ్ చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిందే
Video: పాకిస్తాన్ ఫీల్డింగ్ చూస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిందే
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కొత్తిల్లు కడుతున్నారా.? ఈ బేసిక్‌ వాస్తు నియమాలు పాటించండి..
కొత్తిల్లు కడుతున్నారా.? ఈ బేసిక్‌ వాస్తు నియమాలు పాటించండి..
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
వేప చెట్టు నుంచి కారుతున్న పాలు.. ఆ దేవత మహిమేనంటూ మహిళల పూజలు
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
బాబోయ్‌..హైదరాబాద్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ కలకలం..
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.