AP News: నా పుట్టినరోజు నాడు మీ అందరి ఆశీస్సులు కోరుతున్నా – సీఎం జగన్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేస్తోంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించారు సీఎం జగన్‌..చింతపల్లిలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు సీఎం జగన్‌. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.  

AP News: నా పుట్టినరోజు నాడు మీ అందరి ఆశీస్సులు కోరుతున్నా - సీఎం జగన్
Cm Jagan Public Meeting
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 21, 2023 | 1:04 PM

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేస్తోంది.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించారు సీఎం జగన్‌..చింతపల్లిలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. అడవి తల్లి బిడ్డల మధ్య గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు సీఎం జగన్. 55 నెలలుగా ప్రతి అడుగు విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా వేసినట్లు తెలిపారు. పిల్లలకు అవసరమైన బైజుస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇస్తున్నామన్నారు జగన్. ట్యాబ్‌లలో చదువుకు సంబంధించిన అంశాలే ఉంటాయని.. తల్లిదండ్రులకు ఎలాంటి భయాలు అక్కర్లేదన్నారు. ట్యాబ్ లలో ఏ సమస్య వచ్చినా గ్రామ సచివాలయంలో ఇస్తే.. రిపేర్ చేసి ఇస్తామన్నారు. రిపేర్ కాకుంటే కొత్త ట్యాబ్ ఇస్తామని జగన్ తెలిపారు. తాము అందిస్తున్న ట్యాబ్ మార్కెట్ విలువ 17,500 అని తెలిపారు. విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు..ఇప్పుడు అందించే ట్యాబ్ లలో 11,12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256GB కి పెంచి అందిస్తున్నారు.

ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫెల్ ప్రిపరేషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా అన్ని ట్యాబ్ ల్లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డౌట్ క్లియరెన్స్ బాట్ అప్లికేషన్.. పిల్లలు సులభంగా విదేశీ భాషలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి పొందేందుకు వీలుగా డ్యులింగో ఇన్ స్టాల్ చేశారు.

4 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఉచితంగా అందిస్తున్న రూ.15,500 విలువైన బైజూస్ కంటెంట్ ఇక 11, 12వ తరగతులకు కూడా అందించనున్నారు. తద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు కంటెంట్ రూపేణా లబ్ధి కలుగుతుంది. మెమరీ కెపాసిటీ పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణ కోసం రగ్డ్ కేస్. టెంపర్డ్ గ్లాస్ వంటి అదనపు హంగులు కల్పించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…