Andhra Pradesh: జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు సీటు గల్లంతైనట్టే!
వచ్చే ఎన్నికల్లో కొందరికి టికెట్ కట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నియోజకవర్గ అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పని తీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలపై దృష్టి సారిస్తున్నారు.టికెట్ కేటాయింపుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. ఆయన ఆదేశాల మేరకు సీటు వదులుకోవడానికి జగ్గంపేట ఎమ్మెల్యే చంటి బాబు సిద్ధమయ్యారు. కాకాపోతే కండీషన్స్ అప్లై

వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరునున్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థుల విషయంలో ఇప్పటి నుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎవరికి టికెట్ ఇవ్వాలి..? ఎవరికి ఇవ్వొద్దన్న దానిపై కీలక చర్చలు జరుపుతోంది. వచ్చే ఎన్నికల్లో కొందరికి టికెట్ కట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నియోజకవర్గ అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పని తీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలపై దృష్టి సారిస్తున్నారు.
టికెట్ కేటాయింపుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. ఆయన ఆదేశాల మేరకు సీటు వదులుకోవడానికి జగ్గంపేట ఎమ్మెల్యే చంటి బాబు సిద్ధమయ్యారు. కాకాపోతే కండీషన్స్ అప్లై అంటున్నారు. ఇంతకీ ఏంటాయన కండీషన్స్. అభ్యర్థుల వడపోతలో భాగంగా జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు సీటు దాదాపుగా గల్లంతైనట్టే. ఎందుకంటే ఇటీవలే చంటిని క్యాంప్ ఆఫీసుకు పిలిచిన పార్టీ అధిష్ఠానం.. జగ్గంపేటలో కొత్తవారికి అవకాశం ఇస్తాం.. వారికి సహకరించాలని సూటిగా చెప్పేసింది.
దీంతో చేసేదేమీ లేక టికెట్‌పై ఆశలు వదిలేసుకుంది చంటిబాబు వర్గం. అయితే కొత్తగా నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థి.. తనకూ, తన వర్గానికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. తమ అనుచరుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే.. వారి నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




