Time Travel: టైం ట్రావెల్ సాధ్యమైనా? ఆ విద్యార్థి చెబుతున్న థియరీ నిజమేనా?
టైం ట్రావెల్ చేయడం సాధ్యమా? అంటే అసాధ్యమైతే కాదని మాత్రం చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీనిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు దీని గురించి ఎందుకూ అంటే.. 2020లో ఓ ఫిజిక్స్ విద్యార్థి చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారింది. టైం ట్రావెల్లో స్క్వేర్ ద నంబర్స్ పేరిట అతను చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఎందుకు?
మనిషికి ఇప్పటి వరకూ తీరని ఓ కల టైం ట్రావెల్. అంటే గతంలోకి వెళ్లడం.. భవిష్యత్తును తెలుసుకోవడం. దీని కోసం శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశంపైనే అనాకానేక సైన్స్ ఫిక్షన్ సినిమాలు కూడా మనం చూశాం. మన తెలుగులో అయితే బాలయ్య బాబు ఆదిత్య 369 గుర్తుకురాక మానదు. దానిలో వర్తమానం నుంచి టైం మిషన్ సాయంతో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లడం, ఆ తర్వాత భవిష్యత్తులోకి వెళ్లి జరగబోయేది తెలుసుకోవడం మనం చూశాం. ఇక ఇంగ్లిష్ లో అయితే ది టెర్మినేటర్, డోనీ డార్కో, బ్యాక్ టు ది ఫ్యూచర్ వంటి సినిమాలు భవిష్యత్తు ప్రపంచాన్ని మన కళ్లకు కడతాయి. అయితే ఇవన్నీ ఊహాజనితమైనవే. ఏదీ వాస్తవం కాదు. అయితే అలా టైం ట్రావెల్ చేయడం సాధ్యమా? అంటే అసాధ్యమైతే కాదని మాత్రం చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీనిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు దీని గురించి ఎందుకూ అంటే.. 2020లో ఓ ఫిజిక్స్ విద్యార్థి చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారింది. టైం ట్రావెల్లో స్క్వేర్ ద నంబర్స్ పేరిట అతను చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఎందుకు? ఆ విద్యార్థి చెప్పింది ఏమిటి? తెలుసుకుందాం రండి..
ఎవరా విద్యార్థి..
2020లో, ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విద్యార్థి, జర్మైన్ టోబర్, టైమ్ ట్రావెల్‌ను ఎలా సాధ్యం చేయొచ్చో సూచించాడు. అతని వివరణ మరోసారి వైరల్ అవుతోంది. టోబర్ ఏం చెబుతున్నారంటే.. ఒక నిర్ధిష్ట సమయంలో ఒక వ్యవస్థ స్థితి ఎలా ఉందో తెలుసుకోగలిగితే.. ఆ వ్యవస్థ మొత్తం చరిత్రను సులభంగా తెలుసుకోవచ్చని క్లాసికల్ డైనమిక్స్ ప్రకారం వివరించాడు. ఈ టోబర్ అనే విద్యార్థి డాక్టర్ ఫాబియో కోస్టా పర్యవేక్షణలో పనిచేశాడు. ఈ విద్యార్థి చేసిన పరిశోధన గురించి కోస్టా మాట్లాడుతూ టోబర్ అనే విద్యార్థి స్క్వేర్ ద నంబర్స్(సంఖ్యలను వర్గీకరించడం) కనుగొన్నాడన్నారు. ‘ది మ్యాథ్స్ చెక్స్ అవుట్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ ద స్టఫ్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్’ అంటే గణితం నుంచి సైన్స్ ఫిక్సన్ అంశాలను క్రోడికరించవచ్చని చూపించాడని చెప్పాడు.
ఉదాహరణకు కోవిడ్ 19 బాగా వ్యాపిస్తున్న సమయంలోకి వెళ్లి.. ఒక్క రోగి కూడా వైరస్ బారిన పడకుండా కాపాడే ప్రయత్నం చేశారనుకోండి. ఆ ప్రయత్నం చేయాలని చెబుతున్నాడు. కానీ అది సాధ్యం కాదు. అది చాలా ప్రకృతి వైరుధ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే అది గతంలో జరిగిపోయినది. దానిని మార్చలేం. కానీ టోబర్ మాత్రం ‘పారడొక్స్ ఫ్రీ’ ప్రయాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. టైం ట్రావెలర్ ఏం చేసినా ఆ వ్యాధి ఆగదు. కాబట్టి వైరుధ్యాలు సృష్టించడానికి ప్రయత్నించాలని చెబుతున్నాడు.
అసలు టైం ట్రావెలింగ్ సాధ్యమేనా..
టైం ట్రావెలింగ్ సాధ్యమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఎలా అంటే.. ఈ సృష్టిలో కాంతిని మించిన వేగం లేదు. ద్రవ్యరాశి ఉన్న ఏ వస్తువు కూడా కాంతి కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించలేదు. అయితే కాంతితో సమానంగా ప్రయాణించగలిగితే భూత, భవిష్యత్ కాలాలను చేరుకోవచ్చని శాస్త్రవేత్తల భావన. కాంతి వేగాన్ని అందుకోవాలంటే సెకనుకు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఉదాహరణ కావాలంటే వేల ఏళ్ల క్రితం భూమి పై జరిగిన ఘటనలు ఇప్పటికీ అంతరిక్షలో కాంతి రూపంలో వెళ్తూనే ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. వాటిని మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే.. అవి ఎప్పుడో జరిగనవని అర్థమట. వాటిని మనం లైవ్ లో చూడాలంటే కాంతికంటే వేగంగాప్రయాణించాలి. శూన్యంలో ఆ సంఘటనలు ఎంత దూరం ప్రయాణించాయో.. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే అప్పుడా కాలంలోకి చేరుకోవచ్చు. నిన్నటి సూర్యోదయాన్ని చూడాలంటే 24 గంటలు వెనక్కి వెళ్లాలి. అంటే ఆ సమయంలో కాంతి ప్రయాణించిన రెండు వేల 592 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవాలి. అది కూడా సెకను కంటే తక్కువ సమయంలోనే . అది జరిగితే నిన్నటి సూర్యోదయాన్ని చూడగలమంటున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..