AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Find My Device: మీ ఫోన్‌ పోయిందా? గూగుల్‌ హెల్ప్‌తో తిరిగి పొందడం మరింత ఈజీ

డిజిటల్‌ పేమెంట్లు ఎక్కువ కావడంతో ఇప్పుడు దొంగలు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్న స్మార్ట్‌ ఫోన్లను కొట్టేస్తున్నారు. అయితే ఫోన్‌ పోయిందని వదిలెద్దామంటే అందులోని విలువైన డేటా తస్కరిస్తారేమో? అని భయం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ సమయంలో ఫోన్‌ను తిరిగి పొందడానికి పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అందరూ వాడే ఫోన్లు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌ను అందించే గూగుల్‌ మన ఫోన్లు ఎక్కడ ఉన్నాయో? తెలుసుకునేందకు ఫైండ్‌ మై డివైజ్‌ అనే ఆప్షన్‌ ద్వారా సాయం చేస్తుంది.

Find My Device: మీ ఫోన్‌ పోయిందా? గూగుల్‌ హెల్ప్‌తో తిరిగి పొందడం మరింత ఈజీ
Find My Device
Nikhil
| Edited By: |

Updated on: Dec 22, 2023 | 6:50 PM

Share

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది. గతంలో దొంగలు మన జేబుల్లోని పరసులను కొట్టేసేవారు. అయితే డిజిటల్‌ పేమెంట్లు ఎక్కువ కావడంతో ఇప్పుడు దొంగలు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్న స్మార్ట్‌ ఫోన్లను కొట్టేస్తున్నారు. అయితే ఫోన్‌ పోయిందని వదిలెద్దామంటే అందులోని విలువైన డేటా తస్కరిస్తారేమో? అని భయం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఈ సమయంలో ఫోన్‌ను తిరిగి పొందడానికి పోలీసులను ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అందరూ వాడే ఫోన్లు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌ను అందించే గూగుల్‌ మన ఫోన్లు ఎక్కడ ఉన్నాయో? తెలుసుకునేందకు ఫైండ్‌ మై డివైజ్‌ అనే ఆప్షన్‌ ద్వారా సాయం చేస్తుంది. కాబట్టి గూగుల్‌ ఫైండ్‌ మై డివైజ్‌ను వాడుకుని తస్కరించిన ఫోన్‌ను ఎలా కనుగొనాలో? ఓసారి తెలుసుకుందాం.

ఫైండ్‌ మై డివైజ్‌ సెటప్‌

వినియోగదారుడు ఫోన్‌లో గూగుల్‌ ఖాతాను ఉపయోగించి లాగిన్‌ అయితే స్వయం చాలకంగానే ఫైండ్‌ మై డివైజ్‌లో నమోదవుతుంది. అయితే భద్రతా సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ సదుపాయాన్ని ఆపేయచ్చు. ఇలా చేస్తే ఫోన్‌ పోగొట్టుకున్న సమయంలో కనుగొనడం కుదరదు. మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను లాగిన్‌ అయ్యాక యాక్టివ్‌ ఇంటర్నెట్‌ ఉంటేనే ఫోన్‌ కనుగొనడం సులభం అవుతుంది. ముఖ్యంగా మీ ఫోన్‌ ఎక్కడైనా పెట్టి మర్చిపోయిన సందర్భంలో తిరిగి కనుగొనడంలో ఫైండ్‌ మై డివైజ్‌ యాప్‌ సరిగ్గా సరిపోతుంది. అలాగే ఈ ఫైండ్‌ మై డివైజ్‌ ద్వారా మన ఫోన్‌ లాక్‌ చేసి డేటా తస్కరించడకుండా చేయవచ్చు. ఫైండ్‌ మై డివైజ్‌ ద్వారా చేసే మూడు ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.

సౌండ్‌ ప్లే చేయడం

మన ఫోన్‌ కనుగొనడానికి పొగొట్టుకున్న ఫోన్‌లోని గూగుల్‌ ఖాతాను వేరే ఇతర  ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన ఫైండ్‌మై డివైజ్‌లో లాగిన్‌ అయ్యి తెలుసుకోవచ్చు. ఫోన్‌ దగ్గర్లో ఉన్నట్టు గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా చూపితే ప్లే సౌండ్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకుంటే మన ఫోన్‌ ఎక్కడ ఉన్నా సౌండ్‌ ప్లే అవుతుంది. ఫోన్‌ సైలెంట్‌లో ఉన్నా సౌండ్‌ ప్లే అవుతుంది.

ఇవి కూడా చదవండి

డేటా కూడా సేఫ్‌

ముఖ్యంగా ఫోన్‌ పోయినప్పుడు అందులోని డేటా గురించిన భయం అందరినీ వేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఫైండ్‌ మై డివైజ్‌ ద్వారా ఫోన్‌ను లాక్‌ చేసుకోవచ్చు. అలాగే లాక్‌ స్క్రీన్‌ మన సందేశాన్ని కనిపించేలా చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా మన ఫోన్‌ ఎవరికైనా దొరికితే తిరిగిచ్చే అవకాశం ఉంటుంది. 

డేటా రీసెట్‌

మన ఫోన్‌ను ఎక్కడ కనుగొనలేకపోతే మాత్రం ఫైండ్‌ మై డివైజ్‌ ద్వారా ఫోన్‌ రీసెట్‌ చేయవచ్చు. ఇలా చేస్తే మన డేటా దుర్వినియోగం కాకుండా ఉంటుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ