ఆ ఫోన్‌పై ఏకంగా రూ. 3,000 తగ్గింపు.. పూర్తి వివరాలు
Samsung Galaxy A14 5G: శామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జీ ఫోన్ పై డిస్కౌంట్ ను ప్రకటించింది. మిడ్ రేంజ్ లెవెల్లో ఉండే ఈ ఫోన్ ధర లాంచింగ్ అప్పుడు రూ. 16,499గా ఉంది. అయితే ఇప్పుడు ఇది రూ. 14,499కే లభిస్తోంది. అంటే రూ. 2,000 తగ్గింపు. అంతేకాక అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మన దేశంలో శామ్సంగ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రజలకు ఈ బ్రాండ్ పై అపార నమ్మకం కూడా ఏర్పడింది. అందుకే ఈ ఫోన్లు కొనుగోలు చేయాలంటే పెద్దగా ఆలోచించరు. అందుకు తగినట్లుగా శామ్సంగ్ తన కస్టమర్ బేస్ పక్కకు మళ్ల నీయకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఓ 5జీ స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించి, వినియోగదారులకు ఆకర్షిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జీ ఫోన్ పై డిస్కౌంట్ ను ప్రకటించింది. మిడ్ రేంజ్ లెవెల్లో ఉండే ఈ ఫోన్ ధర లాంచింగ్ అప్పుడు రూ. 16,499గా ఉంది. అయితే ఇప్పుడు ఇది రూ. 14,499కే లభిస్తోంది. అంటే రూ. 2,000 తగ్గింపు. అంతేకాక అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
శామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జీ తాజా ధరలు..
ప్రస్తుతం ఈ శామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జీ రూ. 14,499కే అందుబాటులో ఉంది. వాస్తవానికి దీనిని 2023 జనవరిలో లాంచ్ చేసినప్పుడు రూ. 16,499గా ఉండింది. వినియోగదారులు ఇప్పుడు రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపును పొందుతున్నారు. అంతేకాక అదనంగా మరో రూ. 1,000 వరకూ ప్రత్యేకమైనా తగ్గింపు కూడా ఉంది, అంటే దీనితో ఈ ఫోన్ మీరు కేవలం రూ. 13,499కి కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ శామ్సంగ్ అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధరలు ఇవి.
శామ్సంగ్ గెలాక్సీ ఏ14 5జీ బెస్ట్ చాయిసేనా..
ఈ ఫోన్ ధర తగ్గించారు సరే.. మరీ దీనిని కొనుగోలు చేయడం ఉత్తమమేనా అని ఆలోచిస్తే.. ఇదే ధరలో, ఇవే ఫీచర్లతో శామ్సంగ్ ఎం సిరీస్ ఫోన్ ఒకటి ఉంది. అది శామ్సంగ్ గెలాక్సీ ఎం14 5జీ. ఇది కూడా ఏ14 ఫోన్ కు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రెండూ సేమ్ బడ్జెట్లో ఇప్పుడు లభిస్తున్నాయి. రెండు ఫోన్ల పనితీరు ఒకేలా ఉంది. అయితే ఎం14, ఏ 14 కంటే మెరుగైన డిస్ ప్లే, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఏ14 కన్నా ఎం14 మెరుగైన ఎంపికగా నిపుణులు చెబుతున్నారు.
రెండింటిలో స్పెసిఫికేషన్లు ఇలా..
శామ్సంగ్ గెలాక్సీ ఎం14లో 6.6 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఇది అధిక రిజల్యూషన్ తో కూడిన ఫుల్ హెచ్ డీ ప్లస్ స్క్రీన్ ఉంటుంది. అదే సమయంలో ఏ14లో హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఎం14 ఫోన్లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఏ14 ఫోన్లో కేవలం 5,000ఎంఏహెచ్ మాత్రమే ఉంటుంది. అయితే, మీరు ఈ ఫోన్‌లతో పాటు ఛార్జర్‌ను పొందలేరు. బ్యాటరీని టాప్ అప్ చేయడానికి పాత ఛార్జర్‌లను ఉపయోగించవచ్చు. అదనంగా, ఫోన్ వెనుక ప్యానెల్ డిజైన్ శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్23 మాదిరిగానే కనిపిస్తుంది, కాబట్టి మీరు బడ్జెట్ ధరలో అధునాతన డిజైన్‌ను పొందుతున్నారు.
శామ్సంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ మన దేశంలో రూ. 12,490లకు లభిస్తోంది. వాస్తవానికి దీ ప్రారంభ ధర లాంచింగ్ సమయంలో రూ. 14,490గా ఉండేది. ఇప్పుడు దీనిపై శామ్సంగ్ రూ. 2,000ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. ఇదే సమయంలో శామ్సంగ్ గెలాక్సీ ఏ14 ఫోన్ కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఈ రెండింటితో కంపేర్ చేస్తే మీకు ఎం14 మెరుగైన ఎంపికగా కనిపిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..