KTR: విద్యుత్ క‌ష్టాల‌కు కాంగ్రెస్ పార్టీనే కార‌ణం.. అసెంబ్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాడీవేడిగా చర్చ కొనసాగింది. విద్యుత్ రంగంపై అధికార కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసింది. దీంతో విద్యుత్‌ అప్పులపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలాయి.. ఈ క్రమంలో బీఆర్ఎస్ విద్యుత్ రంగం, బకాయిలపై చర్చకు సిద్ధమంటూ ప్రకటించింది.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 21, 2023 | 8:38 PM

తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాడీవేడిగా చర్చ కొనసాగింది. విద్యుత్ రంగంపై అధికార కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రం విడుదల చేసింది. దీంతో విద్యుత్‌ అప్పులపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలాయి.. ఈ క్రమంలో బీఆర్ఎస్ విద్యుత్ రంగం, బకాయిలపై చర్చకు సిద్ధమంటూ ప్రకటించింది. చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ‌లో విద్యుత్ క‌ష్టాల‌కు కాంగ్రెస్ పార్టీనే కార‌ణం అంటూ విమర్శించారు. నీళ్లు, బొగ్గు లేని రాయ‌ల‌సీమలో, బొగ్గు లేని విజ‌య‌వాడ‌లో థ‌ర్మల్ పవ‌ర్ కేంద్రాలు నెల‌కొల్పరంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ‌లో ఆ రోజు విద్యుత్ కేంద్రాలు క‌ట్టకుండా, రాష్ట్రం ఏర్పడే నాటికి 27 వంద‌ల మెగావాట్ల లోటు న‌ష్టాల‌తో త‌మ‌కు అప్పజెప్పార‌ంటూ కేటీఆర్ వివరించారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ రంగ ప‌రిస్థితిపై చ‌ర్చ సంద‌ర్భంగా మాట్లాడిన కేటీఆర్.. 55 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర, నిర్వాకాన్ని వైట్ పేప‌ర్‌లో చాలా గొప్పగా చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి ప్రజలు 11 సార్లు అవ‌కాశం ఇస్తే 2014 నాటికి ఆరు గంట‌ల క‌రెంట్ మాత్రమే ఇచ్చారని.. వారి తప్పులను వారే ఒప్పుకున్నారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ