AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulichintala Project: కుప్పలు, తెప్పలుగా చేపలు.. కావాల్సిన సైజువి పట్టుకుని.. గంపల్లో ఇంటికి

ఎవరైనా ఇంట్లోకి కిలోనో, రెండు కిలోలో చేపలు తీసుకెళ్తారు. కానీ పులిచింతల సమీప గ్రామాల ప్రజలు మాత్రం.. గంపల కొద్దీ పట్టుకెళ్తున్నారు.

Pulichintala Project: కుప్పలు, తెప్పలుగా చేపలు.. కావాల్సిన సైజువి పట్టుకుని.. గంపల్లో ఇంటికి
Fish At Pulichintala
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2021 | 2:10 PM

Share

ఎవరైనా ఇంట్లోకి కిలోనో, రెండు కిలోలో చేపలు తీసుకెళ్తారు. కానీ పులిచింతల సమీప గ్రామాల ప్రజలు మాత్రం.. గంపల కొద్దీ పట్టుకెళ్తున్నారు. పులిచింతల 16వ క్రస్ట్ గేటు విరిగిపడడంతో.. ప్రాజెక్ట్‌లో నీటిని భారీ మొత్తంలో దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో.. కాలువలో నీళ్లు తగ్గిపోయాయి. ప్రాజెక్ట్ దిగువున నీటి ప్రవాహం తగ్గిపోవడంతో.. భారీగా చేపలు బయటపడుతున్నాయి. కుప్పలు, కుప్పలుగా చేపలు కనిపించడంతో.. స్థానికులకు పంట పండింది. పైగా ఆదివారం కావడంతో.. గంపల కొద్దీ చేపలను పట్టుకుని వెళ్లారు.

విరిగిన గేటు వద్ద.. రెండు రోజుల్లోనే స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు

పులిచింతల ప్రాజెక్టులో గేటు విరిగిపోయిన రెండు రోజుల్లోనే దాని స్థానంలో స్టాప్‌ లాగ్‌ గేటును ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమం చేసి, రికార్డు సృష్టించారు. ప్రాజెక్టు గేటు విరిగిపోయాక ..దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువ సమయంలో స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు చేసి, నీటి నిల్వను పునరుద్ధరించిన దాఖలాలు లేవని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటుతో ప్రాజెక్టులో నీటి మట్టం 129.19 అడుగుల్లో 6.4 టీఎంసీలకు చేరింది. విరిగిపోయిన 16వ గేటు వెనుక భాగంలో రెండు పియర్‌లకు ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ ద్వారా స్పిల్‌ వే బ్రిడ్జిపై నుంచి గ్యాంట్రీ క్రేన్‌ ద్వారా తొలుత 17 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల ఎత్తు, 28 టన్నుల బరువు ఉన్న ఎలిమెంటును దించారు. దానిపై అంతే బరువున్న రెండో ఎలిమెంటును దించారు. అప్పటి నుంచే నీటి నిల్వ మొదలైంది. ఇలా ఎలిమెంట్‌లను ఒకదానిపై మరొకటి ఏర్పాటు చేస్తూ నీరు కిందకు రాకుండా రబ్బర్‌ సీళ్లు వేశారు. అర్ధరాత్రి చివరగా 23 టన్నుల బరువున్న 11వ ఎలిమెంటును దించారు. దాంతో 18.50 మీటర్ల ఎత్తు, 17 మీటర్ల వెడల్పుతో కూడిన స్టాప్‌ లాగ్‌ గేటు ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఇది మిగతా గేట్ల తరహాలో ఎత్తడానికి, దించడానికి వీలుండదు. నీటి నిల్వకు దోహదం చేస్తుంది.

Also Read: మరీ ఇంత దారుణమా..! కులం పేరుతో అవమానం.. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగినే

తవ్వేకొద్ది కదులుతున్న డొంక.. రియల్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు