AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YV Subba Reddy: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ. సుబ్బారెడ్డి నియామకం..

YV Subba Reddy Appointed as TTD Chairman: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి టీటీడీ చైర్మన్‌గా

YV Subba Reddy: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ. సుబ్బారెడ్డి నియామకం..
Yv Subba Reddy
Shaik Madar Saheb
|

Updated on: Aug 08, 2021 | 1:45 PM

Share

YV Subba Reddy Appointed as TTD Chairman: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ జగన్ సర్కార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల పదవీకాలం గత నెలలో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్‌గా పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డికే మరలా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో త్వరలో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం కూడా జరగనుంది.

అయితే కొత్త చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన ఏపీ ప్రభుత్వం.. పాలకమండలి సభ్యులను మాత్రం ప్రకటించలేదు. 37 మంది బోర్టు సభ్యుల నియామకం త్వరలోనే ఉంటుందని తెలుస్తోంది. వీరిలో ఇతర రాష్ట్రాల వారిని కూడా నియమించనున్నారు.

Ttd Yv Subbareddy

Ttd Yv Subbareddy

ఇదిలాఉంటే.. ఏపీలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. అయితే ఇటీవల రెండున్నరేళ్లు పూర్తి కావడంతో ఇటీవలనే చైర్మన్‌తోపాటు.. సభ్యుల పదవీకాలం ముగిసింది.

Also Read:

Elephant: నీళ్లు తాగుతున్న ఏనుగుపై మొసలి దాడి చేసింది.. గజరాజుకు కోపమొచ్చింది.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా..

Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ లడ్డూలు తినండి చాలు..