Andhra Pradesh: వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ!
ఏడు జిల్లాల్లోని 22 ముంపు ప్రాంతాల్లో సహయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.. మొత్తంగా 9 NDRF, 8 SDRF బృందాలతో సహయక చర్యలు చేపడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల కోసం ప్రభుత్వం సహాయక బోట్లు.. ఓ హెలీకాఫ్టర్ కూడా సిద్ధం చేసి ఉంచినట్టుగా వెల్లడించారు. వర్షాల కారణంగా ఏర్పడిన
బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత రెండు మూడు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడనంతగా ఈసారి వర్షం కురిసింది. అయితే వర్షాలు, వరదల పై ఏపీ హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం మీద 294 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని తెలిపారు. ముంపు ప్రభావిత ప్రాంతాలకు చెందిన ప్రజలు13, 227 మందిని పునరావాస శిభిరాలకు తరలించామని తరలించామని రాష్ట్ర హోం మంత్రి అనిత వివరించారు.
తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ప్రస్తుత వరద పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. భారీ వర్షాలు.. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందినట్టు మంత్రి అనిత అధికారికంగా ప్రకటించింది. 14 జిల్లాల పరిధిలో 1,56,610 ఎకరాల్లో వరిపంట మునిగిపోయింది. దాదాపు 18,045 ఎకరాల మేర ఉద్యాన పంటలకు నష్టం కలిగిందని స్పష్టం చేశారు మంత్రి అనిత.