Viral Video: హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు..సంచిలో వేసుకున్న స్థానికులు
అయితే హైదరాబాద్‌లోని ఓ రైతు బజార్లో వర్షానికి పలు దుకాణాల్లోని కూరగాయలు, ఆకుకూరలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇది చూసిన స్థానికులు వాటిని ఏరుకుని సంచుల్లో వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
తెలంగాణ వ్యాప్తంగా జోరువాన కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. పలుచోట్ల చెట్లు కూలటంతో వానహదారులు, ప్రయాణికులు అవస్థలుపడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో రైలు పట్టాలు కొట్టుకుపోవటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోనూ ఓ ఆర్టీ బస్సు వాగుకి అవతలి వైపు నిలిచిపోయింది. వానధాటికి ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతుంది. అయితే హైదరాబాద్‌లోని ఓ రైతు బజార్లో వర్షానికి పలు దుకాణాల్లోని కూరగాయలు, ఆకుకూరలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇది చూసిన స్థానికులు వాటిని ఏరుకుని సంచుల్లో వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Published on: Sep 01, 2024 11:39 AM
వైరల్ వీడియోలు
Latest Videos