AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్ష బీభత్సం.. వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. 10 గంటలుగా ప్రయాణికుల అవస్థలు

శనివారం రాత్రి బయల్దేరిన ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి మధ్య నిలిచిపోయింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 గంటలుగా బస్సులోనే అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Jyothi Gadda
|

Updated on: Sep 01, 2024 | 11:12 AM

Share

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. రాయపర్తి మండలం మొరిపిరాల శివారులో జాతీయ రహదారిపై చెట్టు విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వరంగల్ జిల్లా తోపనపల్లి వద్ద ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

వేములవాడ నుంచి మహబూబాబాద్ కు శనివారం రాత్రి బయల్దేరిన ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా వెంకటాపురం-తోపనపల్లి మధ్య నిలిచిపోయింది. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో 10 గంటలుగా బస్సులోనే అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేక చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తమను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలని కోరుతున్నారు.

మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తుండటంతో సూర్యుడు కనిపించకుండా పోయాడు. ఎటూచూసిన దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం, మధ్యాహ్నం అనే తేడా లేకుండా మొత్తం చీకటి అలుముకుంది. మరోవైపు, ముసురుతో పాటు, చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. చలిగాలి వీస్తుండటంతో ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..