AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారిగా పెరిగిన వరద.. లంకల్లో చిక్కుకుపోయిన గొర్రెల కాపరులు.. కొనసాగుతున్న రిస్క్యూ

రెండు రోజుల నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు క‌ృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. శుక్రవారం(ఆగస్ట్ 30) సాయంత్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పులిచింతల ప్రాజెక్ట్ వస్తున్న వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.

ఒక్కసారిగా పెరిగిన వరద.. లంకల్లో చిక్కుకుపోయిన గొర్రెల కాపరులు.. కొనసాగుతున్న రిస్క్యూ
Shepherd In Krishna River
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Sep 01, 2024 | 4:17 PM

Share

రెండు రోజుల నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు క‌ృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. శుక్రవారం(ఆగస్ట్ 30) సాయంత్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పులిచింతల ప్రాజెక్ట్ వస్తున్న వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 6,50,000 క్యూసెక్కులు ప్రాజెక్ట్ కు వస్తుండగా 6.25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు. దీంతో లంక గ్రామాల చుట్టూ నీరు చేరింది.

అయితే శుక్రవారం ఉదయాన్నే లంక గ్రామాల్లో గొర్రెలను మేపుకొనేందుకు వెళ్లిన కాపరలు వరద నీరు చుట్టుముడుతుండటంతో ఆందోళనకు గురయ్యారు. లంకల్లో నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా భారీ వర్షం కారణంగా రాలేకపోయారు. తాజాగా కొంత మేర వర్షం తగ్గుముఖం పట్టినా, కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో బయటకు రాలేక గొర్రెల కాపరులు బిక్కుబిక్కుమంూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయకచర్యలు ముమ్మరం చేసింది.

దీంతో గొర్రెలతో సహా ఒడ్డకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొంతమంది గొర్రెల కాపరులు తమను కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తామున్న పరిస్థితులను వివరిస్తూ వీడియోలు పంపించారు. కోనూరు, కస్తల, మునగోడు, దిడుగు, ధరణి కోట, అమరావతి, వైకుంఠపురంలోని లంకల్లో గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. మరోవైపు పులిచింతల నుండి దిగువకు గంట గంటకు నీటి విడుదలను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కాపరులు ఆందోళనకు గురవుతున్నారు.

వీడియో చూడండి..

అయితే పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావులు అమరావతి చేరుకుని వరద ఉధృతిని అంచనా వేశారు. వెంటనే లంకల్లోని వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు భారీ పడవలను పంపించారు. అలా వెళ్లిన పడవులు కాపరులతో పాటు గొర్రెలను ఒడ్డుకు తీసుకొచ్చాయి. ఇప్పటి వరకూ 36 మంది కాపరులను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చినట్లు పల్నాడు జిల్లా అధికారులు తెలిపారు. ఇంకా కొన్ని లంకల్లో చిక్కుకున్న వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ప్రకాశం దిగువకు వరద ఉధృతి పెరిగింది. దీంతో కొల్లూరు మండలంలోని సుగ్గుణల్లంక, ఈపూరు లంక, చింతల్లంక, పెసర్లంక, గాజుల్లంక గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. పునరావాస కేంద్రాలను రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసిన స్థానికులు మాత్రం ఇళ్లలో నుండి రాలేమని తేల్చి చెప్పారు. దీంతో పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..