Naga Chaitanya, Sobhita:పెళ్లి తర్వాత తొలి సంక్రాంతిని గ్రాండ్‌గా జరుపుకున్న నాగ చైతన్య, శోభిత

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆచితూచి సినిమాలు చేస్తూ కెరీర్ లో ఒకొక్క స్టెప్ ఎక్కుతూ రాణిస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఆటోనగర్ సూర్య, మజిలీ, లవ్ స్టోరీలాంటి సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నాడు నాగ చైతన్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు

Naga Chaitanya, Sobhita:పెళ్లి తర్వాత తొలి సంక్రాంతిని గ్రాండ్‌గా జరుపుకున్న నాగ చైతన్య, శోభిత
Naga Chaitanya And Sobhita
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 15, 2025 | 7:40 PM

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడ్డాడు. ఈ జంట గతఏడాది పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. అలాగే ఈ పెళ్ళికి పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. వీరి వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ సహా పలువురు హాజరయ్యారు. పెళ్లి తర్వాత ఈ జంట పలు టెంపుల్స్ కు కూడా వెళ్లారు. నాగార్జునతో కలిసి కొత్త పెళ్లికూతురు పెళ్ళికొడుకు శోభిత, చైతన్య పలు ఆలయాలను దర్శించుకున్నారు.

ఇది కూడా చదవండి :ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

ఇక ఈ జంట పెళ్లైన తర్వాత తో సంక్రాంతిని సంబరంగా జరుపుకున్నారు. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫోటోలను శోభిత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో శోభిత పొంగల్ సెలబ్రేషన్స్ ఫోటోలను పంచుకుంది. భోగిమంటతో పాటు ముగ్గులు వేసిన ఫోటోలను పంచుకుంటూ.. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫొటోల్లో శోభిత సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్

ఇక నాగ చైతన్య శోభిత కంటే ముందు సమంతను పెళ్లాడిన విషయం తెలిసిందే. మనస్పర్థల కారణంగా ఈ ఇద్దరూ విడిపోయారు. సామ్ తో విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో పడ్డారు చై. వీరి వివాహం డిసెంబర్ లో జరిగింది. నాగ చైతన్య సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి