Mahesh Babu: అందరూ ఇరగదీశారు.. ఆ బుడ్డోడు తెగ నవ్వించాడు.. సంక్రాంతికి వస్తున్నాంపై మహేష్ రివ్యూ..

సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేశ్ సంక్రాతికి వస్తున్నాం సినిమాలకు మంచి స్పందన వస్తోంది. అయితే గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్స్.. కానీ వెంకీ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం టోటల్లీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

Mahesh Babu: అందరూ ఇరగదీశారు.. ఆ బుడ్డోడు తెగ నవ్వించాడు.. సంక్రాంతికి వస్తున్నాంపై మహేష్ రివ్యూ..
Mahesh Babu And Venkatesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 15, 2025 | 7:23 PM

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో వెంకటేష్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులచేత నవ్వులు పూయించారు. అలాగే వెంకటేష్ కు జోడిగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. తొలి షో నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీమ్ మొత్తం ఆనందంలో తేలిపోతున్నారు.

ఇది కూడా చదవండి :ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రమే కాదు, సినీ సెలబ్రెటీలు కూడా ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పై సూపర్ స్టార్ మహేష్ బాబు రివ్యూ ఇచ్చారు. సినిమా అదిరిపోయింది అని తెలిపారు మహేష్. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని బాగా ఎంజాయ్‌ చేశాం. అందరం తెగ ఎంజాయ్ చేశాం అని తెలిపారు మహేష్ బాబు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్

మహేష్ బాబు ట్వీట్ చేస్తూ..” సంక్రాంతికి వస్తున్నాం సినిమాని బాగా ఎంజాయ్‌ చేశాం. సరైన పండుగ సినిమా ఇది. వెంకటేష్ గారు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. నా దర్శకుడు అనిల్‌ రావిపూడి వరుసగా బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ను అందుకోవడం గర్వంగా ఉంది. హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. అలాగే సినిమాలో బుల్లి రాజు పాత్రలో కనిపించిన చిన్నోడు చాలా బాగా నటించి, నవ్వించాడు. చిత్ర యూనిట్‌ సభ్యులు అందరికీ కంగ్రాట్స్‌ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి