Sankrantiki Vastunnam: సంక్రాంతికి వస్తున్నాం కోసం వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్..!

అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ అంటే చాలు కచ్చితంగా ఆడియన్స్ ఊహించేది పక్కా ఎంటర్‌టైన్మెంటే. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఊహించినట్లుగానే మొదటి రోజు మార్నింగ్ షోస్ నుంచే ఫ్యామిలీస్ థియేటర్స్ దగ్గర కనిపిస్తున్నారు.

Sankrantiki Vastunnam: సంక్రాంతికి వస్తున్నాం కోసం వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్..!
Sankranthiki Vasthunnam
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 15, 2025 | 7:27 PM

ఈ రోజుల్లో థియేటర్స్‌కు ఫ్యామిలీ ఆడియన్స్ రావడమే గగనం అయిపోయింది. ఎంత పెద్ద సినిమా విడుదలైనా కూడా కుటుంబ ప్రేక్షకులను థియేటర్స్ వరకు రప్పించేసరికి దర్శక నిర్మాతల తలప్రాణం తోకలోకి వచ్చేస్తుంది. ఒకవేళ సినిమా బాగుందని తెలిసినా కూడా మొదటి రోజు ఎందుకు.. రెండు మూడు రోజుల తర్వాత చూసుకుందాం లే అనుకుంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. అలాంటిది ఫస్ట్ డే మార్నింగ్ షోల నుంచే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కు వచ్చేలా చేసారు అనిల్ రావిపూడి, వెంకటేష్.

అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ అంటే చాలు కచ్చితంగా ఆడియన్స్ ఊహించేది ఎంటర్‌టైన్మెంట్. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఊహించినట్లుగానే మొదటి రోజు మార్నింగ్ షోస్ నుంచే ఫ్యామిలీస్ థియేటర్స్ దగ్గర కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు ఇది జరగలేదు. అటు అనిల్.. అటు వెంకీ ఉండటంతో ఈ మ్యాజిక్ జరిగింది. ఏపీ, తెలంగాణలో అయితే ఉదయం 8 గంటల నుంచే కుటుంబ ప్రేక్షకులు క్యూ కట్టారు. పైగా సంక్రాంతి పండగ రోజే అంత పొద్దున్నే సినిమాకు ఫ్యామిలీస్ రావడం అంటే చిన్న విషయం కాదు.. ఎందుకంటే ఇంట్లో పూజలు పునస్కారాలు చాలా ఉంటాయి.

అవన్నీ కాదని సినిమాకు వచ్చారు ఆడియన్స్. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా థియేటర్స్ ముందు హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించాయి. ఏపీ, తెలంగాణ అనే తేడా లేదు.. ఎటు చూసినా అన్నిచోట్లా హౌజ్ ఫుల్సే. స్క్రీన్స్ సరిపోక ఓవర్ ఫ్లోస్ అవుతున్నాయి కూడా. దాంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు థియేటర్స్ ఇంకా పెంచుతున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాతో కచ్చితంగా ఆయనకు లాభాల పంట పండటం ఖాయంగా కనిపిస్తుంది. ఎంతైనా అనిల్ రావిపూడి తెలివైనోడబ్బా.. మాస్ సినిమా చేస్తే ఒక్క టికెట్ మాత్రమే తెగుతుంది.. అదే పండక్కి పక్కా ఫ్యామిలీ సినిమాతో వస్తే కనీసం 4 టికెట్లు అయినా తెగుతాయి అని ప్లాన్ చేసాడు.. సక్సెస్ అయ్యాడు.