Kangana Ranaut : కంగనా రనౌత్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. ఆ దేశంలో ఎమర్జెన్సీ సినిమా పై బ్యాన్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా రిలీజ్ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక గాంధీకి కూడా ఈ ట్రైలర్ బాగా నచ్చిందని కంగనా సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చింది. ఎమర్జెన్సీ సినిమా పక్కా పొలిటికల్ కథ. ఈ సినిమా విడుదలకు కంగనా చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.

Kangana Ranaut : కంగనా రనౌత్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. ఆ దేశంలో ఎమర్జెన్సీ సినిమా పై బ్యాన్
Kangana Ranaut
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 15, 2025 | 7:51 PM

నటి కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. 70ల నాటి కథతో ఈ సినిమా ఉండనుంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఈ సినిమాపై నిషేధం విధించారు. దీని వల్ల సినిమాకు ఎదురుదెబ్బ తగులుతుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి :ఈ రెండు జెళ్ల సీతను గుర్తుపట్టారా.? ఆమెను ఇప్పుడు చూడగానే లవ్‌లో పడిపోతారు

‘ఎమర్జెన్సీ’ సినిమా గతేడాది సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే విడుదల ఆలస్యమైంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేసింది. మొదట్లో సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. చివరకు సెన్సార్ ఇచ్చిన కట్స్ తో అంగీకరించిన తర్వాత, కంగనా సర్టిఫికేట్ ఇచ్చారు. నిర్మాతగా, దర్శకురాలిగా కంగనా ఈ సినిమాతో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్‌లో నిషేధించారు.బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీ స్క్రీనింగ్‌ను నిలిపివేసే నిర్ణయం భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం ఉన్న సంబంధాలకు సంబంధించినది. అలాగే 1975లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ రెహమాన్ హత్యను సినిమాలో చూపించారని అంటున్నారు. దీంతో అక్కడ సినిమాపై నిషేధం విధించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్

పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్‌ను విడదీయడంలో షేక్ ముజీబీర్ రెహమాన్ కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ మిలిటెంట్ల గుంపు అతడిని చంపినట్లు సినిమాలో చూపించారు. నిషేధానికి ప్రధాన కారణం ఇదే అంటున్నారు. కంగనా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఇందిరా గాంధీ పాత్రను కూడా పోషించింది. ఈ సినిమాలో ఆమె నటన అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 17న సినిమా విడుదలవుతోంది. మరి ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి