AP Weather Report: రాగల మూడు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు.. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు
AP Weather Report: వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 3.1 కిమీ & 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలలో
AP Weather Report: వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్ర మట్టానికి 3.1 కిమీ & 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటలలో వాయువ్య బంగాళాఖాతం & పరిసరాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి.
1. ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాం : ఈ రోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలలో గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితలగాలులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశంఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
2. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలలో గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితలగాలులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశంఉంది.
3. రాయలసీమ : ఈ రోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.