AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. వచ్చే 2 రోజులు ఫుల్‌గా వర్షాలే వర్షాలు

వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల మీద అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుసంధానంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉన్నది.

AP News: ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. వచ్చే 2 రోజులు ఫుల్‌గా వర్షాలే వర్షాలు
Ap Rain Alert
Ravi Kiran
|

Updated on: Aug 16, 2024 | 3:38 PM

Share

వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల మీద అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుసంధానంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉన్నది. తదుపరి 2 రోజులలో ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. గంగ పరివాహక-పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌పై తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారుతుంది. ఆ తర్వాత తదుపరి 3 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా, గంగ పరివాహక-పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పరిసర ప్రాంతాల మీదుగా పయనించే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ఇప్పుడు ఫలోడి, బనస్థలి, శివపురి, సిధి, రాంచీ, పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ మీద ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది.

ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక, పొరుగు ప్రాంతాలపై ఉంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉన్నది. కొంకణ్ నుండి ఆగ్నేయ అరేబియా సముద్రం వరకు ఉన్న ద్రోణి, ఇప్పుడు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు దక్షిణ అంతర్భాగ కర్నాటక, పొరుగు ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా వ్యాపించి, సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.

—————————————- రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:- ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ————————————————

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ————————————–

ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ:- —————-

ఈరోజు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?