Vidadala Rajini: తీవ్ర అస్వస్థతకు గురైన మంత్రి విడదల రజిని.. ప్రభుత్వ కార్యక్రమంలో ఒక్కసారిగా..
Health Minister Vidadala Rajini : వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. జగ్గయ్యపేట హాస్పిటల్ ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత.. మంత్రి రజిని ఇవాళ ప్రారంభానికి వచ్చారు.
Health Minister Vidadala Rajini : వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. జగ్గయ్యపేట హాస్పిటల్ ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత.. మంత్రి రజిని ఇవాళ ప్రారంభానికి వచ్చారు. ఈ సమయంలో అక్కడే ఏర్పాటు చేసిన సభలో కూర్చుని ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.స్టేజిపైనే ఉన్న మంత్రికి పక్కనే ఉన్న అధికారులు ఓఆర్ఎస్ ఇచ్చారు. ఆ తర్వాత సభలో మాట్లాడేందుకు మంత్రి ప్రయత్నించినా వీలుకాలేదు. అయినా కొలుకోకపోవడంతో వెంటనే కార్యక్రమం నుంచి బయటికి వెళ్లిపోయారు మంత్రి. దగ్గరలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. అక్కడే ప్రభుత్వ వైద్యులు సెలైన్ పెట్టారు. అయినా ఇంకా పూర్తిగా కొలుకోలేదని చెప్తున్నారు.
ప్రైవేట్ వైద్యురాలుగా పనిచేస్తున్న తమ బంధువుల కుమార్తె పర్యవేక్షణలో మంత్రి రజనికి వైద్యం కొనసాగుతుంది. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకుంటుందని మంత్రి బంధువులు చెప్పారు. నిన్న రాత్రి చిలకలూరిపేట నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని అక్కడినుంచి నేరుగా జగ్గయ్యపేటలోని బంధువుల ఇంటికి వచ్చారు మంత్రి రజిని.
పని ఒత్తిడి, రెస్ట్ లేకపోవడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం చిలకలూరిపేట వెళ్లాల్సిన మంత్రి ఇప్పటికీ జగ్గయ్యపేటలోని బంధువుల ఇంట్లోనే వైద్యం తీసుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..