కిడ్నీ బాధిత కుటుంబాలకు రాష్ట్ర సర్కార్ గుడ్‌న్యూస్.. విస్తరిస్తున్న డయాలసిస్ నెట్ వర్క్..!
కిడ్నీ వ్యాధి అనేది ఒక వ్యక్తి ఎదుర్కొనే ఆరోగ్య సమస్య కాదు.. ఆ కుటుంబం మొత్తాన్ని కుదిపేసే ఆర్థిక సంక్షోభం. డయాలసిస్ కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ.. ప్రైవేట్ ఆసుపత్రులలో వేల రూపాయలు ఖర్చు చేస్తున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు అది ఒక పెద్ద శిక్షలా మారేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మారుమూల ప్రాంతంలో నివసించే కిడ్నీ బాధితులకు ఏపీ ప్రభుత్వం కలిగిస్తుంది.

కిడ్నీ వ్యాధి అనేది ఒక వ్యక్తి ఎదుర్కొనే ఆరోగ్య సమస్య కాదు.. ఆ కుటుంబం మొత్తాన్ని కుదిపేసే ఆర్థిక సంక్షోభం. డయాలసిస్ కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ.. ప్రైవేట్ ఆసుపత్రులలో వేల రూపాయలు ఖర్చు చేస్తున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు అది ఒక పెద్ద శిక్షలా మారేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మారుమూల ప్రాంతంలో నివసించే కిడ్నీ బాధితులకు ఏపీ ప్రభుత్వం కలిగిస్తుంది. రోగి దగ్గరకే రక్త శుద్ధి సేవలు చేరాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకెళుతుంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెకండరీ ప్రభుత్వ ఆసుపత్రులలో కొత్తగా పదమూడు డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంతకు ముందు ప్రకటించిన కేంద్రాలకు అదనంగా మరో ఐదు కేంద్రాలకు తాజాగా అనుమతి ఇవ్వడం విశేషం.. ఇందులో రెండు కేంద్రాలు గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు ప్రాణాధారం లభించనుంది..
ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు క్షేత్రస్థాయి ప్రధానమంత్రి డయాలసిస్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా ఐదు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు, ప్రకాశం జిల్లా కొండేపి, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, కడప జిల్లా మైదుకూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రాంతాలలో త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి సత్య కుమార్ వెల్లడించారు.
అంతే కాకుండా భీమవరం, పీలేరు, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట, జమ్మలమడుగు ప్రాంతాలలో టెండర్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుంది. ఎస్ కోట , సీతంపేటలో ఇప్పటికి కేంద్రాలు సిద్ధమై సేవల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి డయాలసిస్ కేంద్రాన్ని అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కేంద్రానికి సుమారు 85 లక్షల వ్యయంతో మిషన్లను అమరుస్తున్నారు. మొత్తం 13 కేంద్రాల కోసం ప్రభుత్వం దాదాపు 11.0 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. ప్రతి కేంద్రంలో ఐదు డయాలసిస్ యంత్రాలు ఉండగా రోజుకు మూడు షిఫ్టుల్లో సేవలు అందించనున్నారు. దీంతో ఒక్కొక్క కేంద్రం ద్వారా నెలకు సుమారు 375 సెషన్లను నిర్వహించగల సామర్థ్యం ఉంటుందని రాష్ట్ర మంత్రి తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక డయాలసిస్ 3,000 నుంచి 4 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నెలకు పదిసార్లు పెంచుకోవాల్సిన పరిస్థితుల్లో సామాన్యుడికి అది భరించలేని భారమే.. ఈ పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం 2,047 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తుంది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో కిడ్నీ బాధితుల కోసం మాత్రమే కూటమి ప్రభుత్వం 164 కోట్ల రూపాయల వ్యయం చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
