Aata Sandeep: పైసలు ఇస్తా.. వారం నాతో గడుపుతావా అని ఆమె అడిగింది.. ఓపెన్ అయిన ఆట సందీప్
ఆట సందీప్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. మనోడు మంచి డ్యాన్సర్. అతని వైఫ్ జ్యోతి కూడా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. వీరిద్దరి వీడియోలు నిత్యం నెట్టింట సర్కులేట్ అవుతూనే ఉంటాయి. ఇటీవల మన శంకర వర ప్రసాద్ సినిమాలో హుక్ స్టెప్ పాటకు కొరియోగ్రఫీ చేసి అద్భుతమైన పేరు తెచ్చుకున్నాడు సందీప్.

ఆట సందీప్.. తెలుగులో పాపులర్ డ్యాన్సర్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఆట ఫస్ట్ సీజన్‌లో పాల్గొని విన్నర్‌గా నిలిచాడు సందీప్. అప్పటినుంచి అతడి పేరు ఆట సందీప్‌గా పాపులర్ అయింది. ఎంత టాలెంట్ ఉన్నా అతనికి ఎంతో మంచి బ్రేక్ చాలాకాలం రాలేదు. ఛాంపియన్ చిత్రంలో గిరగిర గింగిరానివే.. పాటతో అతని లైఫ్‌లో మేజర్ టర్న్ అని చెప్పాలి. ఆ తర్వాత.. మన శంకర వరప్రసాద్ మూవీలో హుక్ స్టెప్ సాంగ్‌తో అతనికి బిగ్గెస్ట్ సక్సెస్ వచ్చింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 18 ఏళ్ల తర్వాత.. అతని ఈ బ్రేక్ దొరికింది. అయితే ఈ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు సందీప్. డబ్బు ఇస్తాం.. తమతో గడపమని పలువురు మహిళలు అడిగినట్లు చెప్పాడు.
Also Read: ఆ సినిమా అసలు ఆడదని దిల్ రాజుకి చెప్పిన భార్య.. కట్ చేస్తే రిలీజ్ అయ్యాక.
తాజాగా, కొన్ని రోజుల క్రితం తన సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చిందని.. అమెరికా నుంచి వచ్చిన ఓ మహిళ ఇక్కడ ఒక వారం ఎంజాయ్ చేయాలి, డబ్బు ఇస్తా.. తనతో గడపమని ఆఫర్ చేసిందని వెల్లడించాడు. ఈ మెసేజ్ చాలా పద్ధతిగా, కార్పొరేట్ స్టైల్‌లో మీకు ఆసక్తి ఉందా? అని అడిగినట్టుగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ఆమె ఎవరో, ఏంటో తనకు తెలియదని వివరించాడు. అయితే, తాను వెంటనే నాకు ఆసక్తి లేదు అని బదులిచ్చినట్టు తెలియజేశారు. రెండు రోజుల తర్వాత అదే పర్సన్ నుంచి మళ్లీ మెసేజ్ వచ్చిందని.. మీకు ఇంకా ఎక్కువ డబ్బు కావాలంటే ఇస్తాను, మీకు కావల్సినది ఇస్తాను, రండి అని ఆ సందేశం సారాంశమని పేర్కొన్నాడు. దీనికి కూడా తాను సారీ, నాకు ఆసక్తి లేదు అని స్పష్టంగా చెప్పి, ఆ నంబర్‌ను బ్లాక్ చేసినట్టు ఆయన స్పష్టం చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
