AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nutrition news: గుడ్లు నిజంగా ఆరోగ్యానికి మంచివేనా? వాటిని తినే సరైన పద్ధతి ఇదే

Eggs Health Benefits: మనం తీసుకునే గుడ్లు శరీరానికి అనేక ప్రోటీన్లు, విటమిన్లు అందిస్తాయని చెబుతున్నారు. వాటిని తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు. మరి నిజానికి గుడ్లు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయి? వాటిని తినే సరైన పద్ధతి ఏది? నిపుణుల అభిప్రాయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Jan 25, 2026 | 10:53 AM

Share
Egg Nutrition: ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో, గుడ్లు తినాలా వద్దా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఒకవైపు గుడ్లు ప్రోటీన్‌కు మంచి మూలమని చెబుతారు. మరోవైపు కొలెస్ట్రాల్ గురించి భయపడే వారు కూడా ఉన్నారు. అయితే, గుడ్లు ఆరోగ్యానికి మంచివే  అయినప్పటికీ.. ఎన్ని తినాలి? ఎలా తీసుకోవాలి అనేది ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే గుడ్లు శరీరానికి అనేక ప్రోటీన్లు, విటమిన్లు అందిస్తాయని చెబుతున్నారు. వాటిని తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు. మరి నిజానికి గుడ్లు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయి? వాటిని తినే సరైన పద్ధతి ఏది? నిపుణుల అభిప్రాయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Egg Nutrition: ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో, గుడ్లు తినాలా వద్దా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఒకవైపు గుడ్లు ప్రోటీన్‌కు మంచి మూలమని చెబుతారు. మరోవైపు కొలెస్ట్రాల్ గురించి భయపడే వారు కూడా ఉన్నారు. అయితే, గుడ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. ఎన్ని తినాలి? ఎలా తీసుకోవాలి అనేది ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే గుడ్లు శరీరానికి అనేక ప్రోటీన్లు, విటమిన్లు అందిస్తాయని చెబుతున్నారు. వాటిని తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు. మరి నిజానికి గుడ్లు ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయి? వాటిని తినే సరైన పద్ధతి ఏది? నిపుణుల అభిప్రాయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

గుడ్లలో ఉన్న పోషకాలు..

గుడ్లు తక్కువ ఖర్చుతో లభించే సంపూర్ణ పోషకాహారం అని పోషక నిపుణులు చెబుతున్నారు. గుడ్లలో ఉత్తమ నాణ్యత గల ప్రోటీన్, విటమిన్ A, D, B12, ఐరన్, కాల్షియం, సెలీనియం,  మెదడు ఆరోగ్యానికి అవసరమైన కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, కండరాల బలం, ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

గుడ్లలో ఉన్న పోషకాలు.. గుడ్లు తక్కువ ఖర్చుతో లభించే సంపూర్ణ పోషకాహారం అని పోషక నిపుణులు చెబుతున్నారు. గుడ్లలో ఉత్తమ నాణ్యత గల ప్రోటీన్, విటమిన్ A, D, B12, ఐరన్, కాల్షియం, సెలీనియం, మెదడు ఆరోగ్యానికి అవసరమైన కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా, కండరాల బలం, ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

2 / 6

కొలెస్ట్రాల్‌పై భయం అవసరమా?..

గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ.. అది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని ఎక్కువగా పెంచదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజుకు ఒక గుడ్డు నుంచి మూడు గుడ్ల వరకు తినడం సాధారణంగా సురక్షితమేనని నిపుణులు సూచిస్తున్నారు.

కొలెస్ట్రాల్‌పై భయం అవసరమా?.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ.. అది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని ఎక్కువగా పెంచదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజుకు ఒక గుడ్డు నుంచి మూడు గుడ్ల వరకు తినడం సాధారణంగా సురక్షితమేనని నిపుణులు సూచిస్తున్నారు.

3 / 6

గుడ్లు తినే ఉత్తమ పద్ధతి ఏది?..

గుడ్లు ఎలా తింటామన్నదే ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఉడికించిన గుడ్లు (బాయిల్‌డ్ ఎగ్స్) ఆరోగ్యానికి అత్యుత్తమం అని చెబుతున్నారు. తక్కువ నూనెతో చేసిన పోచ్డ్ లేదా ఆమ్లెట్ కూడా మంచిదే. ఎక్కువ నూనె, వెన్నతో వేయించిన గుడ్లు తరచుగా తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

గుడ్లు తినే ఉత్తమ పద్ధతి ఏది?.. గుడ్లు ఎలా తింటామన్నదే ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఉడికించిన గుడ్లు (బాయిల్‌డ్ ఎగ్స్) ఆరోగ్యానికి అత్యుత్తమం అని చెబుతున్నారు. తక్కువ నూనెతో చేసిన పోచ్డ్ లేదా ఆమ్లెట్ కూడా మంచిదే. ఎక్కువ నూనె, వెన్నతో వేయించిన గుడ్లు తరచుగా తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

4 / 6

ఎవరికి జాగ్రత్త అవసరం?...

డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్లను పరిమితంగా తీసుకోవాలని, అవసరమైతే వైద్యుడు లేదా పోషక నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఎవరికి జాగ్రత్త అవసరం?... డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్లను పరిమితంగా తీసుకోవాలని, అవసరమైతే వైద్యుడు లేదా పోషక నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

5 / 6
ఎంత మోతాదులో తినాలి?...

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 1-3 గుడ్లు లేదా వారానికి 9–12 గుడ్లు తీసుకోవచ్చు. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు లేదా వ్యాయామం చేసే వారికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉండటంతో కొంచెం ఎక్కువగా తీసుకున్న ఆరోగ్యానికి వచ్చే సమస్యేం లేదని చెబుతున్నారు. అయితే, గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కానీ అవి సమతుల్య ఆహారంలో భాగంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో పాటు గుడ్లను తీసుకుంటేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనం పొందవచ్చు.

ఎంత మోతాదులో తినాలి?... సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 1-3 గుడ్లు లేదా వారానికి 9–12 గుడ్లు తీసుకోవచ్చు. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు లేదా వ్యాయామం చేసే వారికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉండటంతో కొంచెం ఎక్కువగా తీసుకున్న ఆరోగ్యానికి వచ్చే సమస్యేం లేదని చెబుతున్నారు. అయితే, గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి కానీ అవి సమతుల్య ఆహారంలో భాగంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో పాటు గుడ్లను తీసుకుంటేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనం పొందవచ్చు.

6 / 6