రాత్రి భోజనం తర్వాత అరటి పండు తినే అలవాటు మీకూ ఉందా?
24 January 2026
TV9 Telugu
TV9 Telugu
అన్ని కాలాల్లో అందరికీ అందుబాటులో ఉండే ఆహారమేదంటే వెంటనే గుర్తుకొచ్చేది అరటి పండు. తక్కువ ధర, తినడానికి సౌలభ్యం, అధిక ప్రయోజనాలు ఇలా అరటి పండు ప్రత్యేకతలెన్నో
TV9 Telugu
తక్షణ శక్తికి, తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావడంలో భేషుగ్గా పనిచేసే ఈ మ్యాజికల్ ఫ్రూట్‌ని డైట్‌లో భాగం చేసుకుంటే మరీ మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు
TV9 Telugu
తిన్న ఆహారం సులువుగా జీర్ణమయ్యేందుకు కొందరు అరటి పండును తీసుకుంటారు. మరికొందరు భోజనం చేయలేని పరిస్థితుల్లో తక్షణ శక్తి కోసం దీనిని ఆహారంగా తీసుకుంటారు
TV9 Telugu
ఇక అరటి పండును తినడం వల్ల మహిళల్లో సంతానోత్పత్తి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు కూడా బాగా తగ్గిపోతాయి
TV9 Telugu
కొంత మందకి టైం లేకనో, ఇతర కారణాల వల్లనో బ్రేక్ ఫాస్ట్ చేసుకోవడానికి బద్ధకిస్తుంటారు. అలాంటివారికి అరటి పండు చాలా చక్కని ఎంపిక
TV9 Telugu
ఈ పండును ఉదయం ఆహారంలో తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మైగ్రెయిన్, తిమ్మిర్లు వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇక ఉదయాన్నే వర్కవుట్ చేసేముందు, తర్వాత కూడా అరటి పండును తీసుకుంటే ఉత్సాహంగా వ్యాయామాలు చేయవచ్చు
TV9 Telugu
రాత్రి భోజనం చేసిన తర్వాత చాలామంది అరటి పండును తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
TV9 Telugu
అరటి పండులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను బాగా నివారిస్తుంది. ఇందులో తక్కువ పరిమాణంలో ఉండే ఫ్రక్టోజ్ ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ సమస్యను బాగా నియంత్రిస్తుంది. తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది