AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీరు పాత ఇల్లు కొనుగోలు చేశారా..? వాస్తు దోషాలు తొలగాలంటే ఇలా చేయండి

Old House Vastu: కొనుగోలు చేసిన పాత ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే, మీరు దాని వల్ల ఇబ్బంది పడతారు, కాబట్టి అలాంటి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఆ ఇంటికి వాస్తు శాంతి చేయడం అవసరం. వాస్తు శాంతి చేయకపోతే, కనీసం ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కలశ పూజ, గణపతి పూజ తప్పనిసరిగా చేయాలి. కొత్త ఇంట్లో ఆహారాన్ని దానం చేయండి. ఇది ఇంట్లోని అన్ని వాస్తు దోషాలను నాశనం చేస్తుంది.

Vastu Tips: మీరు పాత ఇల్లు కొనుగోలు చేశారా..? వాస్తు దోషాలు తొలగాలంటే ఇలా చేయండి
Old House Vastu Tips
Rajashekher G
|

Updated on: Jan 25, 2026 | 11:31 AM

Share

Vastu tips for prosperity: ఇటీవల కాలంలో కొత్త ఇల్లు నిర్మించుకోవడం అనేది చాలా పెద్ద పని. అందరికీ సాధ్యం కాదు. అందుకే చాలా మంది కట్టిన ఇళ్లు లేదా పాత ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, పాత ఇళ్లను కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పాత ఇళ్లలో వాస్తు లోపాలు ఉండటం సాధారణం. ఈ లోపాలు తీసివేయకపోతే సంపద, శాంతి, కుటుంబ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. నిపుణుల సూచనల ప్రకారం కొన్ని సాధారణ వాస్తు పరిహారాలు పాటించడం ద్వారా అన్ని రకాల లోపాలను సులభంగా తొలగించవచ్చు. వాస్తు దోషాలను నివారించడంతోపాటు చిన్న చిన్న పరిహారాలతో మీ ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కలిగించుకోవచ్చు.

పాత ఇంట్లో మొదటగా చేయాల్సిన పని..

ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉంటే, మీరు దాని వల్ల ఇబ్బంది పడతారు, కాబట్టి అలాంటి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఆ ఇంటికి వాస్తు శాంతి చేయడం అవసరం. వాస్తు శాంతి చేయకపోతే, కనీసం ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కలశ పూజ, గణపతి పూజ తప్పనిసరిగా చేయాలి. కొత్త ఇంట్లో ఆహారాన్ని దానం చేయండి. ఇది ఇంట్లోని అన్ని వాస్తు దోషాలను నాశనం చేస్తుంది. కొత్త ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత, అన్ని వస్తువులను వాటి సరైన దిశలో ఉంచాలి.

మీరు పాతదైన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు.. మీరు మొదట చేయవలసిన పని దానికి పెయింట్ చేయించడం. ఇది మీ ఇంటిని అందంగా కనిపించేలా చేస్తుంది. కొత్త రంగు ఇంటిపై ఉన్న మరకలను తొలగిస్తుంది. దీంతో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. పాత ఇల్లు కొనేటప్పుడు వాస్తు దోషాలను నివారించడానికి వాస్తు శాస్త్రం మరొక సులభమైన పరిష్కారాన్ని సూచించింది. ఇంట్లోకి ప్రవేశించే ముందు కొంత ఆవాలు తీసుకొని ఇంటి చుట్టూ చల్లడం తద్వారా మీ ఇంటిని అన్ని చెడు విషయాల నుంచి కాపాడుతుంది.

ఇంటి తలపొడవు, ప్రవేశ ద్వారం పరిశీలన

ఇంటికి ప్రవేశ ద్వారం ఆకర్షణీయంగా ఉండాలి. ద్వారం వద్ద చెత్త, ఎరుపు రంగు వస్తువులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ద్వారం దగ్గర పసుపు, కుంకుమ పూజా చిహ్నాలు పెట్టడం మంచిది. ప్రవేశ ద్వారం దిశ వాస్తు ప్రకారం సౌభాగ్యం, సంపద, శాంతికి సహకరిస్తుంది.

నిపుణుల సూచనలు

ఇంట్లో మొక్కలు, సజీవ పూలు ఉంచడం కూడా శాంతి, సానుకూల శక్తిని పెంచుతుంది. వాస్తుదోషాలు తొలగించాక ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో శాంతి, ఆరోగ్యం పెరుగుతుంది. క్రియేటివ్, సానుకూల శక్తులు ఇంట్లో ప్రవేశిస్తాయి. పాత ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత వాస్తు లోపాలను చిన్న-చిన్న పరిహారాల ద్వారా తొలగించడం చాలా అవసరం. ఇది కేవలం సంపద, శాంతి మాత్రమే కాదు, మనోబలం, కుటుంబ బలాన్ని కూడా పెంచుతుంది.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం కొంత వాస్తు శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

పాత ఇల్లు కొనుగోలు తర్వాత వాస్తు లోపాలను సరిచేసే సులభ మార్గాలు
పాత ఇల్లు కొనుగోలు తర్వాత వాస్తు లోపాలను సరిచేసే సులభ మార్గాలు
తల్లి ప్రేమ మరువలేనిది.. బిడ్డ మృతితో తల్లడిల్లిన గోమాత!
తల్లి ప్రేమ మరువలేనిది.. బిడ్డ మృతితో తల్లడిల్లిన గోమాత!
మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడిగా..
మరో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడిగా..
ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ
ఇదెక్కడి లెక్క సామీ..ఐసీసీ మీద నిప్పులు చెరిగిన మొహ్సిన్ నఖ్వీ
ఏకంగా 23 గిన్నిస్​ రికార్డులు కొల్లగొట్టిన గీతం విద్యార్థిని
ఏకంగా 23 గిన్నిస్​ రికార్డులు కొల్లగొట్టిన గీతం విద్యార్థిని
మీరు గడువు ముగిసిన మొబైల్‌ను ఉపయోగిస్తున్నారా? ఎలా చెక్‌ చేయాలి?
మీరు గడువు ముగిసిన మొబైల్‌ను ఉపయోగిస్తున్నారా? ఎలా చెక్‌ చేయాలి?
జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా?
జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి కూడా స్టార్ హీరోయిన్ అని తెలుసా?
పైసల్ ఇస్తా వస్తావా అని మెసేజ్ పెట్టింది: ఆట సందీప్
పైసల్ ఇస్తా వస్తావా అని మెసేజ్ పెట్టింది: ఆట సందీప్
గుడ్లు నిజంగా ఆరోగ్యానికి మంచివేనా? వాటిని తినే సరైన పద్ధతి ఇదే
గుడ్లు నిజంగా ఆరోగ్యానికి మంచివేనా? వాటిని తినే సరైన పద్ధతి ఇదే
బంగ్లాదేశ్ కోసం వరల్డ్ కప్‌ను త్యాగం చేయనున్న పాక్?
బంగ్లాదేశ్ కోసం వరల్డ్ కప్‌ను త్యాగం చేయనున్న పాక్?