చూస్తే చిన్నవే కానీ.. సన్ ఫ్లవర్ సీడ్స్‌తో ఎన్ని లాభాలో..
Samatha
25 January 2026
సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది గుమ్మడిగింజల లాంటివి ఎక్కువగా తింటారు. అయితే ఇవే కాకుండా సన్ ఫ్లవర్ సీడ్స్ వలన కూడా బోలెడు లాభాలు ఉన్నాయంట.
ఆరోగ్యానికి మంచిది
కాగా, ఇప్పుడు మనం సన్ ఫ్లవర్ సీడ్స్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవి? వీటిని ఎవరు తినడం మంచిదో చూద్దాం.
ఆరోగ్య ప్రయోజనాలు
చూడటానికి చాలా చిన్నగా, నల్లగా కనిపించే సన్ ఫ్లవర్ సీడ్స్ గింజల్లో బోలెడు పోషకాలు ఉన్నాయంట. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంట.
కలిగే మేలు
ఎవరు అయితే ఎక్కువగా కీళ్ల నొప్పులు, మోకాలళ్ల నొప్పులతో బాధపడతారో వారు వీటిని తినడం మంచిది. ముఖ్యంగా అర్థరైటిస్ ఉన్నవారికి ఇవి చాలా మేలు చేస్తాయి.
అర్థరైటీస్
ఎందుకంటే, సన్ ఫ్లవర్ గింజల్లో రాగి, మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి శరీరానికి చాలా మంచిదంట.
శరీరానికి మేలు
అలాగే సన్ ఫ్లవర్ గింజల్లో ఉండే పోషకాలు గుండె జబ్బులకు చాల మంచిది. ఇవి గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని రక్షించి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
గుండె జబ్బులు
సన్ ఫ్లవర్ గింజలు తినడ వలన ఇవి చర్మానికి సహజ మెరుపును ఇస్తాయి. ఈ గింజల్లో ఉండే విటమిన్ ఈ, యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడి, రక్షిస్తుంది.
చర్మానికి మెరుపు
ఇవి క్యాన్సర్ నిరోధకంగా కూడా పని చేస్తాయి. ఈ గింజల్లో ఉండే సెలీనియం, శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, క్యాన్సర్ కణాలను నిరోధిస్తుంది.