మేడారంలో సమ్మక్క, సారలమ్మలకు నైవేద్యంగా బెల్లమే ఎందుకు ఇస్తారో తెలుసా?
Samatha
25 January 2026
మేడారం గిరిజన జాతర ప్రారంభమైంది. రోజుకు కొన్ని వేళ సంఖ్యలో భక్తులు మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
మేడారం జాతర
తెలంగాణ కుంభమేళకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మేడారం చేరుకొని, అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంటారు. అలాగే బెల్లాన్ని నైవేద్యంగా పెడుతున్నారు.
బెల్లమే నైవేద్యం
అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా. అసలు అమ్మవార్లు నైవేద్యంగా బెల్లం మాత్రమే ఎందుకు సమర్పిస్తారో, ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
బెల్లమే ప్రసాదం.. ఎందుకు?
మేడారంలో సమ్మక్క సారలమ్మలకు బెల్లం నైవేద్యంగా సమర్పించడం 13వ శతాబద్ధం నుంచే ప్రారంభమైనదని అక్కడి వారు చెబుతుంటారు.
13వ శతాబద్ధం
అమ్మవారు వెలిసిన సమయంలో ఓ భక్తుడికి కలలో కనిపించి, మీరు నాకు ఇష్టమైన బెల్లం సమర్పిస్తే అది నాకు బంగారంతో సమానం, బంగారం సమర్పిస్తే వారి కోరిక నెరవేరుతుందని చెప్పిందంట.
కలలో..
అప్పటి నుంచి ఇప్పటి వరకు గిరిజనులు తాము అనుకున్నది జరిగితే వారి బరువుకు సమానమైన బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అప్పటి నుంచి బెల్లం సమర్పించడం ప్రారంభమైంది.
బరువుకు సమాన బంగారం
గిరిజనలే కాకుండా ప్రతి ఒక్కరూ తాము కోరిన కోర్కె నెరవేరిన తర్వాత అమ్మవార్ల జాతర సమయంలో బంగారాన్ని(బెల్లం) సమర్పిస్తారు. దీని మాధుర్యం ఎనలేని భక్తికి నిదర్శనం అంటారు ఆదివాసీలు.
గిరిజనులే కాకుండా ఆధునికులు
ఒకప్పుడు ఎక్కువగా ఆదివాసీలు మాత్రమే బెల్లాన్ని తమకు సరిసమానమైన బరువుతో అమ్మవారికి సమర్పించేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బంగారం అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు.