AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: కోటీశ్వరుల అదృష్ట రహస్యం ఇదే..! ఈ విగ్రహాలు లక్ష్మీ దేవిని ఇంటికే తీసుకువస్తాయి..!

కోటీశ్వరుల ఇళ్లలో సంపదను తెచ్చే కొన్ని వస్తువులు ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఆ విగ్రహాలు ఇంట్లో సంపదను పెంచుతాయి. అందుకే అలాంటి విగ్రహాలను మీరు మీ ఇంట్లో ఉంచుకుని సంపదను పెంచుకోవచ్చు. ఇప్పుడు సంపదను పెంచే ఆ విగ్రహాల గురించి తెలుసుకుందాం.

Vastu Tips: కోటీశ్వరుల అదృష్ట రహస్యం ఇదే..! ఈ విగ్రహాలు లక్ష్మీ దేవిని ఇంటికే తీసుకువస్తాయి..!
Laxmi Devi
Rajashekher G
|

Updated on: Jan 25, 2026 | 9:25 AM

Share

సంపదను ఎవరు కోరుకోరు. అందరూ లక్ష్మీదేవి కటాక్షంతో ధనవంతులు కావాలని అనుకుంటారు. అయితే, చాలా మందికి ఏం చేయాలో తెలియదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఇంట్లోని ప్రతి అంశం కుటుంబం యొక్క పురోగతి, శాంతి, ఆనందాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఇంటిని అలంకరించడం శుభ్రప్రదంగా పరిగణించబడుతుంది. ఎవరి ఇంట్లోనైనా ఉండకూడని వస్తువు ఉంటే.. లేదా అది తప్పు స్థానంలో ఉంటే.. ఇంట్లోనివారు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్త్తుంది. ఆర్థిక సమస్యలు, శాంతి లేకపోవడం, అనారోగ్యం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే వాస్తుశాస్త్రం ప్రకారం వస్తువులను ఉంచడం వల్ల సానుకూల ప్రయోజనాలు పొందుతారు. వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉండే వస్తువులు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

కోటీశ్వరుల ఇళ్లలో కనిపించే విగ్రహాలు

ఆవు విగ్రహం

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కామధేను ఆవు విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఈ విగ్రహంతో ఇంటి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సంపద, శ్రేయస్సు నిరంతరం పెరుగుతాయి. దేనికీ లోటు ఉండదు. మీరు ఈ విగ్రహాన్ని లక్షాధికారుల ఇళ్లలో చూసి ఉంటారు. ఈ విగ్రహాన్ని ప్రార్థన గదిలో, సమావేశ గదిలో లేదా అధ్యయన గదిలో ఉంచవచ్చు. దీని కారణంగా, వాతావరణం ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది.

తాబేలు విగ్రహం

తాబేలు విష్ణువు యొక్క కూర్మ అవతారం. వాస్తు శాస్త్రం ప్రకారం.. తాబేలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది. అందువల్ల, ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం మంచిదని భావిస్తారు. డ్రాయింగ్ రూమ్‌లో లోహ తాబేలును ఉంచడం వల్ల సంపద మూలాలు బలపడతాయి. దీని అర్థం మీరు వివిధ వనరుల నుంచి డబ్బును పొందుతూనే ఉంటారు.

ఏనుగు విగ్రహం

వాస్తు, జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇంట్లో వెండి ఏనుగును ఉంచుకోవడం చాలా శుభప్రదం. ఈ విగ్రహం ఆనందం, శ్రేయస్సు, సానుకూల శక్తి, సంపద పెరుగుదలను తెస్తుంది. ఎందుకంటే ఏనుగు విగ్రహం గణేశుడితో ముడిపడి ఉంది. ఇది ఇబ్బందులను తొలగిస్తుంది, సానుకూల ఫలితాలను ఇస్తుంది.

ఈ పనులు అస్సలు చేయవద్దు

ఒకే దేవత యొక్క రెండు విగ్రహాలను లేదా ఒక విగ్రహాన్ని ఒకదానికొకటి ఎదురుగా ఉంచవద్దు. ఇంట్లో విరిగిన లేదా దెబ్బతిన్న విగ్రహాన్ని ఉంచవద్దు. బెడ్ రూమ్ లేదా టాయిలెట్ దగ్గర పూజా మందిరం ఏర్పాటు చేయవద్దు. ఇంట్లో శని దేవుడి విగ్రహాన్ని లేదా కోపంగా ఉన్న దుర్గా విగ్రహాన్ని ఉంచవద్దు. అయితే, లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కోరుకునేవారు పైన తెలిపిన మూడు విగ్రహాలు ఆవు, తాబేలు, ఏనుగు విగ్రహాలను వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచడం మంచిది.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తుశాస్త్యం, జ్యతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

లక్ష్మీ కటాక్షం కోసం కోటీశ్వరులు అనుసరించే వాస్తు రహస్యం తెలుసా..
లక్ష్మీ కటాక్షం కోసం కోటీశ్వరులు అనుసరించే వాస్తు రహస్యం తెలుసా..
ఏడుగురి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ డ్రైవింగ్
ఏడుగురి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ డ్రైవింగ్
ఈ రోజును ఓ వేడుకలా జరుపుకోండి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు
ఈ రోజును ఓ వేడుకలా జరుపుకోండి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు
అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ అతడు అమ్మాయిలతో.. హీరోయిన్..
అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ అతడు అమ్మాయిలతో.. హీరోయిన్..
కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్.. షరతులు వర్తిస్తాయ్!
కేవలం రూ.668కే మోటరోలా 5జి స్మార్ట్ ఫోన్.. షరతులు వర్తిస్తాయ్!
అత్యధిక ఆస్తులు కలిగిన ఇండియన్ సెలబ్రిటీల లేటెస్ట్ లిస్ట్ ఇదే!
అత్యధిక ఆస్తులు కలిగిన ఇండియన్ సెలబ్రిటీల లేటెస్ట్ లిస్ట్ ఇదే!
30ఏళ్లలో ప్రపంచ కప్‎తో ఆడబోమని మొండికేసిన జట్లు ఇవే
30ఏళ్లలో ప్రపంచ కప్‎తో ఆడబోమని మొండికేసిన జట్లు ఇవే
దేవదూతగా మారిన జొమాటో రైడర్..!
దేవదూతగా మారిన జొమాటో రైడర్..!
బాక్సాఫీస్ వద్ద హారర్ జాతరకు రెడీ అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ
బాక్సాఫీస్ వద్ద హారర్ జాతరకు రెడీ అవుతున్న మాస్ మహారాజ్ రవితేజ
జయాపజయాలతో సంబంధం లేదు.. ఎదిగినా ఒదిగుండాలంటున్న స్టార్ హీరోయిన్
జయాపజయాలతో సంబంధం లేదు.. ఎదిగినా ఒదిగుండాలంటున్న స్టార్ హీరోయిన్