ISRO Jobs 2026: ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ.2 లక్షల జీతం
అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ISRO SAC)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులై అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనుంది..

బెంగుళూరు కేంద్రంగా పని చేస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో).. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ISRO SAC)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులై అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
ఇస్రోలో సైంటిస్ట్/ఇంజినీర్ (ఎస్‌డీ/ఎస్‌సీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ లేదా ఎంఈ లేదా ఎంటెక్ లేదా ఎంఎస్సీ లేదా బీఈ/బీటెక్ లేదా బీఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 ఫిబ్రవరి 12వ తేదీ నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 12, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.2,08,700 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోండి.
ఇస్రో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




